జోసెఫ్ ఫ్రాంక్ " బస్టర్ " కీటన్ (1895 అక్టోబర్ 4 - 1966 ఫిబ్రవరి 1) [1] అమెరికన్ నటుడు, హాస్యనటుడు, చిత్రనిర్మాత.[2] ఇతను మూకీ సినిమాల్లో తన కృషికి గాను ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా తన ట్రేడ్‌మార్క్ శారీరక హాస్యంతో (ఫిజికల్ కామెడీ) పాటుగా చలనం లేనట్టుగా ఉండే రాతిలాంటి హావభావాల వల్ల "ద గ్రేట్ స్టోన్ ఫేస్" (గొప్ప రాతి ముఖం) అన్న మారుపేరు పొందాడు.[3] [4] విమర్శకుడు రోజర్ ఎబర్ట్ 1920 నుంచి 1929 మధ్యకాలాన్ని కీటన్ కెరీర్లో అసాధారణమైన కాలం అని అభివర్ణించాడు. అతని ప్రకారం ఆ కాలంలో కీటన్ ఏ అంతరాయం లేకుండా తీస్తూ పోయిన సినిమాలు అతన్ని "సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నట దర్శకుడిగా" నిలబెట్టాయి.[4] 1996లో ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ కీటన్‌ను గురించి "చాప్లిన్ కన్నా కీటన్ సినిమాలను ఎక్కువ అర్థం చేసుకున్నాడు" అని వ్యాఖ్యానిస్తూ అతిగొప్ప సినీ దర్శకుల జాబితాలో ఏడవ స్థానంలో నిలిపింది.[5] 1999లో, అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అతనికి క్లాసిక్ హాలీవుడ్ సినిమాల్లో అతిగొప్ప మేల్ స్టార్స్‌లో 21వ స్థానం ఇచ్చింది.[6]

బస్టర్ కీటన్
1925లో కీటన్
జననం
జోసెఫ్ ఫ్రాంక్ కీటన్

(1895-10-04)1895 అక్టోబరు 4
మరణం1966 ఫిబ్రవరి 1(1966-02-01) (వయసు 70)
లాస్ ఏంజెలస్, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
సమాధి స్థలంఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్, హాలీవుడ్ హిల్స్, కాలిఫోర్నియా
వృత్తి
  • నటుడు
  • కమెడియన్
  • ఫిల్మ్ మేకర్
  • స్టంట్ మేన్
క్రియాశీల సంవత్సరాలు1899–1966
Works
అవర్ హాస్పిటాలిటీ, షెర్లాక్ జూనియర్, ద నేవిగేటర్, సెవెన్ ఛాన్సెస్, ద జనరల్, స్టీమ్‌బోట్ బిల్ జూనియర్
జీవిత భాగస్వామి
నటాలీ టాల్మడ్జ్
(m. 1921; div. 1932)
మే స్క్రివెన్
(m. 1933; div. 1936)
ఎలేనార్ కీటన్
(m. 1940)
పిల్లలు2
తల్లిదండ్రులు
  • జో కీటన్ (తండ్రి)
  • మైరా కట్లర్ (తల్లి)

స్టూడియోతో సంబంధం లేని స్వతంత్ర నిర్మాతగా పనిచేస్తున్న జోసెఫ్ ఎం. షెంక్, ఫిల్మ్ మేకర్ ఎడ్వర్డ్ ఎఫ్, క్లైన్‌లతో కలసి కీటన్ విజయవంతమైన పలు రెండు-రీళ్ళ కామెడీలు తీశాడు.[7] వాటిలో వన్ వీక్ (1920), ద ప్లేహౌస్ (1921), కాప్స్ (1922), ది ఎలక్ట్రిక్ హౌస్ వంటి సినిమాలు ఉన్నాయి. తరువాతి దశలో పూర్తి నిడివి సినిమాలు తీయడం ప్రారంభించాడు; వీటిలో షెర్లాక్ జూనియర్ (1924), ద జనరల్ (1926), స్టీమ్‌బోట్ బిల్ జూనియర్ (1928), ద కెమెరామాన్ (1928) వంటివి గొప్ప పేరు సంపాదించుకున్నాయి.[8] ద జనరల్ సినిమాని కీటన్ సినిమాల్లో మాస్టర్‌పీస్‌గా పరిగణిస్తారు. తర్వాతి తరం సుప్రసిద్ధ అమెరికన్ నటుడు, దర్శకుడు ఆర్సన్ వెల్స్ ఈ సినిమాని "అతిగొప్ప కామెడీ, బహుశా అతిగొప్ప సినిమా కూడా" అని అభివర్ణించాడు.[9][10][11][12] కీటన్ గురించి వెల్స్ మాట్లాడుతూ "అతను అన్ని ప్రశంసలకన్నా మించినవాడు... చాలా గొప్ప కళాకారుడు, తెరమీద నేను చూసిన అత్యంత అందమైన మగవాళ్ళలో అతనొకడు. అతను గొప్ప దర్శకుడు కూడా. చివరగా ఎవరూ అతన్ని సమీపించను కూడా లేరు" అన్నాడు.[13] 2018లో బస్టర్ కీటన్ జీవితాన్ని, కెరీర్‌ని వివరిస్తూ పీటర్ బగ్దనోవిచ్ తీసిన ద గ్రేట్ బస్టర్: ఎ సెలబ్రేషన్ పేరిట డాక్యుమెంటరీ సినిమా విడుదలైంది. ఇందులో కీటన్ సినిమా కృషి, దాని ప్రభావంపై మెల్ బ్రూక్స్, కార్ల్ రీనర్, వెర్నర్ హెర్జోగ్, క్వెంటిన్ టరంటినో వంటి హాలీవుడ్ ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి.[14] సైట్ & సౌండ్ వారి పోల్‌లో ద జనరల్ సినిమాని ప్రముఖమైన స్థానం దక్కింది.[15]

మెట్రో-గోల్డ్‌విన్-మేయర్ కంపెనీకి పనిచేయడం మొదలుపెట్టడం అతని కెరీర్‌లో క్షీణదశ ప్రారంభమైంది. స్టూడియోకి పనిచేసే క్రమంలో తన సృజనాత్మక స్వాతంత్ర్యాన్ని కోల్పోవడం ఇందుకు ముఖ్యకారణం.[16] ఈ దశలో కీటన్‌కి తన భార్య విడాకులు ఇచ్చింది.[17] మద్యానికి బానిసయ్యాడు.[18] 1940లో ఎలీనార్ నారిస్ ను పెళ్ళిచేసుకున్నాకా క్రమేపీ ఈ దశ నుంచి కోలుకున్నాడు.[19] హాస్యనటునిగా తనకున్న ఇమేజ్‌ని తిరిగి ఉపయోగించుకుని కెరీర్ తిరిగి ప్రారంభించి మిగిలిన జీవితమంతా కొనసాగించాడు.1959లో అకాడమీ గౌరవ పురస్కారాన్ని పొందాడు.[20] కెరీర్ చివరి దశలో వైల్డర్స్ సన్‌సెట్ బౌలేవార్డ్, చాప్లిన్ లైమ్‌లైట్, శామ్యూల్ బెకెట్ ఫిల్మ్, ట్విలైట్ జోన్ ఎపిసోడ్ " వన్స్ అపాన్ ఎ టైమ్"లో కీటన్ అతిధి పాత్రలు చేసాడు.[21][22][23]

కీటన్ గురించి తరచుగా వినిపించే మాట ఏమిటంటే - "అతను తన కాలం కన్నా ముందున్నాడు" అని (ఎహెడ్ ఆఫ్ హిజ్ టైమ్). ఆంథోనీ లేన్ తన విశ్లేషణలో సినిమాలో సినిమా (షెర్లాక్ జూనియర్) వంటి సినిమాటిక్ టెక్నిక్స్ 1920ల్లోనే ఎలా కీటన్ ఉపయోగించుకున్నాడో రాశాడు.[24]

మూలాలు

మార్చు
  1. Meade, Marion (1997). Buster Keaton: Cut to the Chase. Da Capo. p. 16. ISBN 0-306-80802-1.
  2. Obituary, Variety, February 2, 1966, page 63.
  3. Barber, Nicholas (January 8, 2014). "Deadpan but alive to the future: Buster Keaton the revolutionary". The Independent. Retrieved November 3, 2015.
  4. 4.0 4.1 Ebert, Roger (November 10, 2002). "The Films of Buster Keaton". Archived from the original on November 3, 2015. Retrieved January 28, 2016.
  5. April 19, EW Staff; EDT, 1996 at 04:00 AM. "The 50 Greatest Directors and Their 100 Best Movies". EW.com (in ఇంగ్లీష్). Retrieved January 19, 2023.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "AFI Recognizes the 50 Greatest American Screen Legends" (Press release). American Film Institute. June 16, 1999. Archived from the original on January 13, 2013. Retrieved August 31, 2013.
  7. Meade, Marion (1995). Buster Keaton: Cut to the Chase. New York: Harper Collins. p. 93. ISBN 0-06-017337-8.
  8. "Buster Keaton's Acclaimed Films". They Shoot Pictures, Don't They. Archived from the original on April 28, 2019. Retrieved September 29, 2016.
  9. "Sight & Sound Critics' Poll (2002): Top Films of All Time". Sight & Sound via Mubi.com. Archived from the original on January 29, 2016. Retrieved January 29, 2016.
  10. "Votes for The General (1924)". British Film Institute. Archived from the original on 2016-10-03. Retrieved September 29, 2016.
  11. Andrew, Geoff (January 23, 2014). "The General: the greatest comedy of all time?". Sight & Sound. Archived from the original on September 6, 2015. Retrieved January 28, 2016.
  12. Orson Welles interview, from the Kino November 10, 2009, Blu-Ray edition of The General
  13. Bogdanovich, Peter (1998). This is Orson Welles (Revised ed.). Da Capo Press. p. 38.
  14. "Review: 'The Great Buster' Brings a Deadpan Genius Back to Life". The New York Times. Retrieved January 6, 2022.
  15. "The Greatest Films of All Time… in 1982". BFI.
  16. "Buster-Keaton.com". Buster-Keaton.com. Archived from the original on March 1, 2010. Retrieved February 17, 2010.
  17. Cox, Melissa Talmadge, in Bible, Karie (May 6, 2004). "Interviews: Melissa Talmadge Cox (Buster Keaton's Granddaughter)". Archived from the original on December 8, 2015. Retrieved December 7, 2015. My Dad was christened Joseph Talmadge Keaton. When my grandparents divorced, my grandmother took her maiden name back and his name legally became Talmadge.
  18. McGee, Scott. "Buster Keaton: Sundays in October". Turner Classic Movies. Retrieved October 19, 2017. Note: Source misspells Keaton's frequent appellation as "Great Stoneface".
  19. Vance, Jeffrey. "Introduction." Keaton, Eleanor and Jeffrey Vance. Buster Keaton Remembered. Harry N. Abrams, 2001, pg. 29. ISBN 0-8109-4227-5
  20. "Buster Keaton". Turner Classic Movies. Retrieved January 21, 2018.
  21. "One of Charlie Chaplin's Best Films Wasn't Silent and Co-Starred Buster Keaton". Collider (in ఇంగ్లీష్). 2023-03-16. Retrieved 2023-05-20.
  22. Andersen, Joceline (2020-08-20). "A brief history of celebrity cameos, from 'Sunset Boulevard' to 'Eurovision Song Contest'". The Conversation (in ఇంగ్లీష్). Retrieved 2023-05-20.
  23. Schneider, A., On Directing Samuel Beckett’s Film Explains Schneider: "During a transatlantic call one day (as I remember) he shattered our desperation over the sudden casting crisis by calmly suggesting Buster Keaton." In print: Schneider, "On Directing Film" (Grove, 1969), 67.
  24. Lane, Anthony (October 15, 1995). "The Fall Guy". The New Yorker.