బాక్సైట్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
బాక్సైట్ ను సాధారణ్ ఫార్ములా Al2O3. 2H2O
ఈ ధాతువు నుండి ప్రధానంగా అల్యూమినియం ను సంగ్రహిస్తారు. భూమి నుండి మైనింగ్ ద్వారా పొందిన ధాతువులో సాధారణంగా మట్టి, ఇసుక వంటి మలినాలు చాలా పెద్ద మొత్తంలో కలిసి ఉంటాయి. ఈ మలినాలను గాంగ్ లేదా ఖనిజ మాలిన్యం అని అంటారు. ఖనిజ మాలిన్యం అధికంగా ఉన్న ధాతువు నుండి వీలైనంత ఖనిజ మాలిన్యంను తక్కువ ఖర్చుతో కూడిన కొన్ని భౌతిక పద్దతుల ద్వారా ధాతువును సాంద్రీకరిస్తారు.
ఇలాంటి ధాతువులను సాంద్రీకరించడానికి చాలా రకాల పద్దతులు ఉన్నాయి. వాటిలో చేతితో ఏరివేయడం, నీటితో కడగడం, ప్లవన ప్రకియ, అయస్కాంత వేర్పాటు పద్దతి ముఖ్యంగా ఉపయోగిస్తారు.
చేతితో ఏరివేయడం: రంగు, పరిమాణం వంటి ధర్మాలలో ధాతువు, గాంగ్ కు మధ్య వ్యత్యాసం ఉంటే ఈ పద్దతిని వాడుతారు. ఈ పద్దతిలో ధాతువు కణాలను చేతితో ఏరివేయడం ద్వారా ఇతర మలినాల నుండి వేరు చేయవచ్చు.
నీటితో కడగడం : ధాతువును బాగా చూర్ణం చేసి వాలుగా ఉన్న తలం పై ఉంచుతారు. పై నుంచి వచ్చే నీటి ప్రవాహాంతో కడుగుతారు. అప్పుడు తేలికగా ఉన్న మలినాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతాయి. బరువైన శుద్దమైన ముడి ఖనిజ కణాలు నిలిచి పోతాయి.
ప్లవన ప్రక్రియ : ఈ పద్దతి ముఖ్యంగా సల్ఫైడ్ ధాతువుల నుంచి ఖనిజ మాలిన్యాన్ని తొలగించడానికి అనువుగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఖనిజాన్ని మెత్తని చూర్ణంగా చేసి, నీటితో ఉన్న తొట్టెలోకి ఉంచుతారు. గాలినీ ఈ తొట్టెలోకి ఎక్కువ పీడనంతో పంపి, నీటిలో నురుగు వచ్చేట్లు చేస్తారు. ఏర్పడిన నురుగు ఖనిజ కణాలను పై తలానికి తీసుకు పోతుంది. తొట్టె అడుగు భాగానికి మాలిన్య కణాలు చేరుకుంటాయి. నురుగు తేలికగా ఉండడం వలన టెట్టులాగా ఏర్పడిన నురుగును దాని నుంచి వేరు చేసి ఆరబెట్టి ధాతు కణాలను పొందవచ్చు.
అయస్కాంత వేర్పాటు పద్దతి : ముడి ఖనిజం గాని లేదా ఖనిజ మాలిన్యం గాని ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయి ఉంటే వాటిని విద్యుదయాస్కాంతాలను ఉపయోగించి వేరు చేస్తారు.
ఈ విధంగా బాక్సైట్ ను వివిధ రకాల పద్దతుల ద్వారా ముడి ఖనిజం నుండి వేరు చేస్తారు .