బాన్పో వంతెన

(బాన్పో బ్రిడ్జి నుండి దారిమార్పు చెందింది)

బాన్పో వంతెన (కొరియన్: 반포대교; హంజా: 盤浦大橋) అనునది దక్షిణ కొరియా దిగువ సియోల్ లో హాన్ నది మీద సియోచో, యోన్గ్సన్ జిల్లాలను కలిపే ఒక ప్రధాన వంతెన. డబుల్ డెక్ వంతెన యొక్క ఎగువ భాగంలో రూపొందించబడిన ఈ బ్రిడ్జి జమ్స్ బ్రిడ్జి పైన ఉంటుంది, ఇది దక్షిణ కొరియా లో నిర్మించబడిన మొట్టమొదది డబుల్ డెక్ వంతెన. అధిక వర్షపాత కాలంలో నీటిమట్టం పెరిగినపుడు నీటి మట్టానికి దగ్గరగా ఉన్న దిగువ డెక్ జమ్స్ వంతెన ముంపునకు గురయ్యేలా రూపొందించబడింది. ఇనుప దూలము వంతెనలా నిర్మించిన ఈ వంతెన 1982లో పూర్తయింది.

బాన్పో బ్రిడ్జ్

반포대교
రాత్రి వేళ బాన్పో బ్రిడ్జ్, సియోల్.
నిర్దేశాంకాలు37°30′56″N 126°59′46″E / 37.5155°N 126.9960°E / 37.5155; 126.9960
OS grid reference[1]
దేనిపై ఉందిహాన్ నది (కొరియా)
స్థలంసియోల్, దక్షిణ కొరియా
నిర్వహణసియోల్ మెట్రోపాలిటన్ హంగాంగ్ ప్రాజెక్ట్ హెడ్‌క్వార్టర్స్
Preceded byహన్నం బ్రిడ్జ్
Followed byడాంగ్‌జాక్ బ్రిడ్జ్
లక్షణాలు
మొత్తం పొడవు1,495 మీ. (4,905 అ.)[1]
వెడల్పు25 మీ. (82 అ.)[1]
చరిత్ర
Engineering design byదే హాన్ కన్సల్టెంట్స్ కంపెనీ, లిమిటెడ్.
నిర్మించినవారుబ్యుక్‌సన్ ఇంజనీరింగ్ & కన్స్ట్రక్షన్ కంపెనీ, లిమిటెడ్.[2]
నిర్మాణం ప్రారంభంజనవరి 11, 1980[2]
నిర్మాణం పూర్తిజూన్ 25, 1982[2]
నిర్మాణ వ్యయం21.5 billion[2]
గణాంకాలు
Daily traffic103,925 (2009)[3]
ప్రదేశం
పటం

మూన్‌లైట్ రెయిన్‌బో ఫౌంటెయిన్

మార్చు

సియోల్‌లోని హన్ నది మీద నిర్మించిన బాన్పో వంతెనకు ఇరువైపులా ఏర్పాటు చేసిన "మూన్‌లైట్ రెయిన్‌బో ఫౌంటెయిన్" 1140 మీటర్ల పొడవు ఉంటుంది. దీని పొడవునా అమర్చిన పదివేల ఎల్‌ఇడి బల్బులతో కూడిన రంధ్రాల నుంచి నిమిషానికి 190 టన్నుల నీరు వంతెన నుంచి 43 మీటర్ల దూరానికి చిమ్మబడుతూ పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. ఈ బ్రిడ్జి ఫౌంటెయిన్ ప్రపంచంలో పొడవైన ఫౌంటెయిన్ బ్రిడ్జిగా గిన్నిస్ బుక్‌ లోకి ఎక్కింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "반포대교[盤浦大橋]". Doopedia (in Korean). Doopedia. Retrieved 1 January 2014.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. 2.0 2.1 2.2 2.3 "토목사업 주요실적". Byucksan Engineering & Construction (in Korean). 2005. Archived from the original on 2 జనవరి 2014. Retrieved 1 January 2014.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. "반포대교". Naver / Encyclopedia of Korean Culture (in Korean). Naver. Retrieved 2 January 2014.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  • ఈనాడు ఆదివారం - 13-07-2014 నాటి వెనుక పేజి