బాబీ (1938 సినిమా)
బాబీ 1938, డిసెంబరు 17న ఫ్రాంజ్ ఓస్టెన్ దర్శకత్వంలో హిందీ కుటుంబ కథా చలనచిత్రం.[1] శారదిండు బండియోపాధ్యాయ్ రాసిన "బిషర్ ధోన్" అనే బెంగాలీ చిన్న కథ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో పైడి జైరాజ్, రేణుకాదేవి, మాయదేవి, వి.హెచ్. దేశాయ్ తదితరులు నటించారు.[2] యుక్తవయసులోనే వితంతువులైన వారిపట్ల భారతీయ సమాజం ఎలాంటి వైఖరిలో ఉంటుంది,"పురుష-స్త్రీ సంబంధాలకు" సమాజంలో ఉన్న విధానం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది.[3]
బాబీ | |
---|---|
దర్శకత్వం | ఫ్రాంజ్ ఓస్టెన్ |
రచన | శారదిండు బండియోపాధ్యాయ్ |
నిర్మాత | బాంబే టాకీస్ |
తారాగణం | పైడి జైరాజ్, రేణుకాదేవి, మాయదేవి, వి.హెచ్. దేశాయ్ |
ఛాయాగ్రహణం | జోసెఫ్ విర్స్చింగ్, పరీంజా |
సంగీతం | సరస్వతిదేవి |
నిర్మాణ సంస్థ | బాంబే టాకీస్ |
పంపిణీదార్లు | రామ్నిక్లాల్ మోహన్ లాల్ అండ్ కంపనీ, ముంబై |
విడుదల తేదీ | డిసెంబరు 17, 1938 |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశం | బ్రిటీష్ ఇండియా |
భాష | హిందీ |
కథ
మార్చుకిషోర్ (పైడి జైరాజ్) నైతికంగా విలువలు గల వ్యక్తి. తన స్నేహితుడు చనిపోతున్నప్పుడు, అతని భార్య బిమాల (మాయదేవి) బాగోగులు తాను చూసుకుంటానని కిషోర్ మాట ఇస్తాడు. బిమాల ఒంటరి, తనను చేరదీయడానికి కుటుంబం లేదు. దాంతో తనను వదినగా భావించి, కిషోర్ బిమాలను తన ఇంటికి తీసుకువస్తాడు. వారి బంధం గురించి సమాజంపై పలు రకాలుగా మాట్లాడుకుంటుంది. పొరుగింటిలో ఉన్న రేణు (రేణుకాదేవి) కిషోర్ ప్రేమిస్తాడు. రేణు తన తండ్రితో కలిసివుంటుంది. ధనవంతురాలైన రేణుని అనుపమ్ (రామశుకల్) వివాహం చేసుకోవాలనుకుంటుంది. అనుపమ్ బంధువైన బేలా (మీరా) కిషోర్‌పై ప్రేమను పెంచుకుంటుంది. రేణు నుండి కిషోర్ ను దూరం చేయడానికి కిషోర్, బిమాలా బంధం గురించి అనుపమ్ చెడుగా ప్రచారం చేయడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. చివరికి, అపార్థాలు తొలగి రేణు, కిషోర్ వివాహం జరుగుతుంది.
నటవర్గం
మార్చు- పైడి జైరాజ్
- రేణుకాదేవి
- మీరా
- మాయాదేవి
- నజీర్ అహ్మద్ ఖాన్
- పి.ఎఫ్. పితవాలా
- వి.హెచ్. దేశాయ్
- జ్ఞాన చంద్ర
- రామ షుకుల్
- అగాజని కాశ్మీరీ
- సరోజ్ బోర్కర్
- ప్రతిమా
- విమలాదేవి
- రాణిబాల
- లలితా డెబుల్కర్
- కె.బి. మంగాలే
- డి.వి. సర్వే
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఫ్రాంజ్ ఓస్టెన్
- నిర్మాత: బాంబే టాకీస్
- రచన: శారదిండు బండియోపాధ్యాయ్
- సంగీతం: సరస్వతిదేవి
- ఛాయాగ్రహణం: జోసెఫ్ విర్స్చింగ్, పరీంజా
- నిర్మాణ సంస్థ: బాంబే టాకీస్
- పంపిణీదారు: రామ్నిక్లాల్ మోహన్ లాల్ అండ్ కంపనీ, ముంబై
ఇతర వివరాలు
మార్చు- శారదిండు బండియోపాధ్యాయ్ బెంగాలీ కథా రచయిత. ఈయన సృష్టించిన కల్పిత డిటెక్టివ్, బయోమ్‌కేష్ బక్షి పాత్రలతో గుర్తింపు పొందాడు.[4]
- హాస్యనటుడు వి.హెచ్. దేశాయ్ బొంబాయి టాకీస్‌లో చేరి ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఇందులో రేణుకాదేవి తండ్రి పాత్రలో నటించాడు.[5]
- ఈ చిత్రంలో రేణుకాదేవి కొత్తగా కనిపించింది.[6]
- ఫిల్మీఇండియా సినీపత్రిక 1930 జనవరి, ఫిబ్రవరి సంచికల్లో బాబీ సినిమా గురించి, నటీనటుల గురించి ప్రశంసలతో వ్యాసాలు రాయబడ్డాయి.[7][8][9]
పాటలు
మార్చుసరస్వతిదేవి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయి.[3] ఈ పాటలను రేణుకాదేవి, మీరా, సరోజ్ బోర్కర్, ఎస్. ఎన్. త్రిపాఠి పాడారు.[10]
పాటల జాబితా
మార్చుక్రమసంఖ్య | పాటపేరు | గాయకులు |
---|---|---|
1 | "Jhukee Aayi Re Badariya Sawan Ki" | Renuka Devi |
2 | "Aaj Toh Anand Bhaye Krishna Aaye" | Renuka Devi |
3 | "Ban Titli Ban Titli Main Phool Phool Par Jaati" | Meera |
4 | "Ghar Aaye Sajan Laut Aaye Kun Bahane Pir Bulayein" | Renuka Devi |
5 | "Hum Qaidi Haan Qaidi Tan Man Qaidi" | Renuka Devi |
6 | "Man Murakh Kyun Diwana" | Saroj Borkar |
7 | "Matwali Koyaliya Bole Ku Ku" | Meera |
8 | "Nahin Dekh Behtar Sataana" | S. N. Tripathi |
9 | "Patta Toota Daal Se" | |
10 | "Phool Sajan Tum Mero Man Bhnwara" | Renuka Devi |
11 | "Tai Tair Ri Jeevan Naiya" | |
12 | "Phool Bagiya Tum Aana Bhanwara Rain Bhaye" | Meera |
13 | "Nanhi Nanhi Bundiya Meh Ra Barse Jiya R Trse" | Renuka devi |
మూలాలు
మార్చు- ↑ Indian cinema. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. 1 January 1998. ISBN 978-81-230-0646-8. Retrieved 24 September 2019.
- ↑ "Bhabhi". citwf.com. Alan Goble. Archived from the original on 24 సెప్టెంబరు 2019. Retrieved 24 September 2019.
- ↑ 3.0 3.1 Chandra, Balakrishnan, Pali, Vijay kumar. "100 Years Of Bollywood-Bhabhi (1938)". indiavideo.org. Invis Multimedia Pvt. Ltd. Retrieved 24 September 2019.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Saradindu". parabaas.com. Parabaas. Retrieved 24 September 2019.
- ↑ Sanjit Narwekar (12 December 2012). Eena Meena Deeka: The Story of Hindi Film Comedy. Rupa Publications. pp. 48–. ISBN 978-81-291-2625-2. Retrieved 24 September 2019.
- ↑ Begum Khurshid Mirza (2005). "9-Renuka Devi: My Celluloid Identity". A Woman of Substance: The Memoirs of Begum Khurshid Mirza, 1918-1989. Zubaan. pp. 136–. ISBN 978-81-89013-31-8. Retrieved 24 September 2019.
- ↑ Harish S. Booch; Karing Doyle (1962). Star-portrait: Intimate Life Stories of Famous Film Stars. Lakhani Book Depot. Retrieved 24 September 2019.
- ↑ Patel, Baburao (January 1939). "Review-Bhabhi". Filmindia. 5 (1): 47. Retrieved 24 September 2019.
- ↑ Patel, Baburao (February 1939). "Studio Close-Ups". Filmindia. 5 (2): 47. Retrieved 24 September 2019.
- ↑ "Bhabhi (1938)". muvyz.com. Muvyz, Ltd. Archived from the original on 19 నవంబరు 2015. Retrieved 24 September 2015.