బాయిలరు పనితీరు సామర్ధ్యం లెక్కించుట

బాయిలరు పని తీరు సామర్ధ్యం అనగా బాయిలరులో ఒక గంటకు ఉత్పత్తి అయ్యిన స్టీము యొక్క ఉష్ణవిలువ (కిలో కేలరిలలో), ఆ స్టీము ఉత్పత్తికై ఒక గంటలో వినియోగించిన ఇంధనం యొక్క ఉష్ణశక్తి(కిలో కేలరిలలో)ల నిష్పత్తి శాతం. బాయిలరు యొక్క సామర్ధ్యంని రెండు రకాలుగా లెక్కిస్తారు.

బాయిలరు అనగా నేమి మార్చు

బాయిలరు అనేది అన్ని వైపుల మూసి వుండి అందులో నీరు లేదా మరేదైన ద్రవాన్ని వేడిచెయ్యు ఒక లోహ నిర్మాణం[1].బాయిలరు నుపయోగించి ప్రధానంగా నీటి ఆవిరిని ఉత్పత్తి చేస్తారు.నీటి ఆవిరిని ఆంగ్లంలో స్టీము (steam) అంటారు.యంత్రశాస్త్రానుసారంగా బాయిలరుకు నిర్వచనం :అన్ని వైపులా మూసి వేయబడి, ఉష్ణం ద్వారా నీటిని ఆవిరిగా మార్చు పరికరం లేదా యంత్ర నిర్మాణం. బాయిలరులను కేవలం స్టీము/ఆవిరి ఉత్పత్తి చేయుటకే కాకుండా నీటిని వేడి చెయ్యుటకు, కొన్ని రకాల మినరల్ నూనెలను అధిక ఉష్ణోగ్రతకు వేడి చెయ్యుటకు కూడా ఉపయోగిస్తారు.వేడి నీటిని తయారు చేయు బాయిలర్లను హాట్ వాటరు బాయిలరు అంటారు.అలాగే వంటనూనెల రిఫైనరి పరిశ్రమలలో ముడి నూనెను 240-270°C డిగ్రీల వరకు వేడి చెయ్యవలసి వుండును.సాధారణంగా నూనెలను100- 150°C వరకు వేడి చెయ్యుటకు స్టీమును ఉపయోగిస్తారు.కాని 240-270°C డిగ్రీల వరకు వేడి చెయ్యాలిఅంటే అధిక వత్తిడి కలిగిన (దాదాపు 18 kg/cm2వత్తిడి) స్టీము అవసరం.అనగా అంతటి ప్రెసరులో స్టీమును తయారు చెయ్యుటకు అధిక మొత్తంలో ఇంధనం ఖర్చు అవ్వుతుంది.ఎందుకనగా నీటి గుప్తోష్ణం చాలా ఎక్కువ.సాధా రణ వాతావరణ ఉష్ణోగ్రత వద్ద 35°C ల కిలో నీటిని 100°C వరకు పెంచుటకు 65 కిలో కేలరిల ఉష్ణశక్తి అవసరం కాగా,100°C వున్న నీటిని ఆవిరిగా మార్చుటకు 540 కిలో కేలరీల ఉష్ణ శక్తి కావాలి.కనుక ఇలా మినరల్/ఖనిజ నూనెలను అధికఉష్ణోగ్రత వరకు వేడిచేసి, ఆనూనెలతో హిట్ ఎక్చెంజరు (heat exchanger) ద్వారా ముడి నూనెను 240-270°C డిగ్రీల వరకు వేడి చేయుదురు. అలాంటి బాయిలరులను థెర్మోఫ్లూయిడ్ బాయిలరులు అంటారు

బాయిలరు పనితీరు సామర్ధ్యం మార్చు

బాయిలరు పనితీరు సామర్ధ్యం లెక్కించుపద్ధతులు రెండు రకాలు. ఒకటి డైరెక్టు విధానం(ప్రత్యక్ష విధానం) మరొకటి ఇన్ డైరెక్టు విధానం(పరోక్ష విధానం)

ప్రత్యక్ష విధానం మార్చు

ఈ విధాన్ని ఇన్ పుట్ -అవుట్ పుట్ విధానం అనికూడా అంటారు.

బాయిలరు సామర్ధ్యం: 

 • ఇక్కడ x అనగా =బాయిలరు సామర్ధ్యం
 • W అనగా =ఉత్పత్తిఅయ్యిన ఉష్ణ శక్తి/విలువ
 • W1 అనగా= ఉపయోగించిన ఉష్ణ శక్తి/విలువ

పై సమీకరణంలో ఉత్పత్తి అయ్యిన ఉష్ణశక్తి అనగా ఒకగంటకు ఉత్పత్తి అయ్యిన స్టీము యొక్క ఉష్ణశక్తి (గంటకు ఉత్పత్తి అయ్యిన స్టీము కిలోలలోx సంతృప్త స్టీము ఉష్ణశక్తి(enthalpy) కిలోకేలరిలలో),అలాగే ఉపయోగించిన ఉష్ణశక్తి అనగా ఒకగంటలో ఇంధన దహనం వలన ఏర్పడిన ఉష్ణశక్తి(ఒక గంటలో మండించిన ఇంధనం కిలోగ్రాముల్లోx ఇంధన ఉష్ణ కెలోరిఫిక్ విలువ) ఇక్కడ ఉత్పత్తి అయిన ఉష్ణశక్తి అనగా ఏవత్తిడి (pressure)వద్ద స్టీము ఉత్పత్తి అయ్యిందో,ఆ వత్తిడి వద్ద స్టీము యొక్క కిలోకేలరిలలో (enthalpy)నుండి ఫీడ్ వాటరు ఉష్ణశక్తిని (కిలో కేలరిలలో) తగ్గించగా వచ్చిన ఉష్ణ విలువ.

కనుక స్టీము నికర ఉష్ణవిలువ= Q x ( h g − h f )

 • ఇక్కడ Q=ఉత్పత్తి అయిన స్టీము పరిమాణం గంటకు కిలోలలో
 • hg =అనగా నిర్దిష్ట స్టీము వత్తిడి వద్ద దాని ఉష్ణవిలువ
 • hf =ఫీడ్ వాటరు ఉష్ణవిలువ

ఉదాహరణ(Example) మార్చు

 • బాయిలరు రకం :హస్క్ ఫైర్డ్(వరి పొట్టు ఇంధనం)
 • ఉత్పత్తి అయిన స్టీము పరిమాణం  : 8 టన్నులు గంటకు
 • స్టీము యొక్క ప్రెషర్ /ఉష్ణోగ్రత  : 10 kg/cm2(g)/ 180°C
 • గంటకు కాలిన వరి పొట్టు  : 1.8 టన్నులు /గంటకు
 • ఫీడ్ వాటరు ఉష్ణోగ్రత  : 85°C
 • వరిపొట్టు ఉష్ణ కేలరిఫిక్ విలువ  : 3200 kCal/kg
 • 10 kg/cm2 వద్ద స్టీము ఉష్ణ కేలరిఫిక్ విలువ : 665 kCal/kg
 • ఫీడ్ వాటరు ఉష్ణ కేలరిఫిక్ విలువ : 85 kCal/kg

బాయిలరు సామర్ధ్యం  

  = 80%

బాయిలరు ఎవాపరేసన్ నిష్పత్తి మార్చు

బాయిలరు ఎవాపరెసన్ నిష్పత్తి అనగా ఒక కిలోగ్రాము స్టీము ఉత్పత్తికి దహించిన,మండించిన ఇంధన పరిమాణం కిలోగ్రాముల్లో. ఉదాహరణ ఒక కిలో బొగ్గు 6 కిలోల స్టీమును ఉత్పత్తి చెయ్యగా, ఒక కిలో ఆయిల్ 13 కిలోల స్టీమును ఉత్పత్తి చెయ్యును.

ఈ వ్యాసాలు కూడా చదవండి మార్చు

ఆధారాలు/మూలాలు మార్చు

 1. "What is Boiler?". thermodyneboilers.com. Archived from the original on 2017-06-15. Retrieved 2018-04-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)