బారిగడుపుల ధర్మయ్య

బారిగడుపుల ధర్మయ్య మహబూబ్ నగర్ జిల్లాలోని జటప్రోలు సంస్థానం సమీపంలోని బారిగడుపుల పుణ్యక్షేత్రవాసి. కవి, పండితుడు. ఇతని తండ్రి తిమ్మప్ప. బారిగడుపుల పుణ్యక్షేత్రాన్ని నిర్మించినది ఈ తిమ్మప్పగారే. ఇక్కడి దేవుడు నరసింహస్వామి. ఈ స్వామి చరిత్రనే బారిగడుపుల ధర్మయ్య ' నృసింహపురాణం ' అను పేరుతో ద్విపద కావ్యంగా రాశాడు[1].. దీనిని ఈ నరసింహస్వామికే అంకితమిచ్చాడు. ఈ కావ్యం ఆరు ఆశ్వాసాల గ్రంథం. ఇందులో జయవిజయుల మూడు జన్మల కథలను కవి కథనంగా మలిచాడు. ఈ కావ్య రచనలో ధర్మయ్య పోతరాజును అనుకరించినట్లు తెలుస్తుంది. ఈ కవి జటప్రోలు సమీపవాసి అయినా ఈ సంస్థానాన్ని ఆశ్రయించినట్లు ఆధారాలేమి లేవు. ' నృసింహపురాణం ' గద్వాల సంస్థానం వారి నుండి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారి కార్యాలయానికి చేరింది.

మూలాలు

మార్చు
  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-30