బారిల్ వన్నెహసాంగి

బారిల్ వన్నెహసాంగి మిజోరాం రాష్ట్రానికి చెందిన టీవీ వ్యాఖ్యాత , రేడియో జాకీ, రాజకీయ నాయకురాలు. ఆమె 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఐజ్వాల్ సౌత్ 3 శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[1], 2024 మార్చి 7న మిజోరాం మొదటి మహిళా అసెంబ్లీ స్పీకర్‌గా నియమితురాలైంది.[2]

బారిల్ వన్నెహసాంగి
బారిల్ వన్నెహసాంగి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 మార్చి 2024
ముందు లాల్బియాక్జామా

శాసన సభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 డిసెంబర్ 2023
ముందు ఎఫ్.లాల్నున్మావియా
నియోజకవర్గం ఐజ్వాల్ సౌత్ 3

ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
18 ఫిబ్రవరి 2021
ముందు సి. లాల్తన్‌సంగ
నియోజకవర్గం వార్డు నెం. 19

వ్యక్తిగత వివరాలు

జననం (1991-02-28) 1991 ఫిబ్రవరి 28 (వయసు 33)
ఐజ్వాల్, మిజోరాం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ జోరం పీపుల్స్ మూవ్‌మెంట్
పూర్వ విద్యార్థి నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ
వృత్తి టీవీ వ్యాఖ్యాత , రేడియో జాకీ, రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం

మార్చు

బారిల్ వన్నెహసాంగి 2021లో రాజకీయాల్లోకి వచ్చి ఐజ్వాల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి వార్డు నంబర్ XIX నుండి కార్పొరేటర్‌గా ఎన్నికైంది. ఆమె 2023లో ఎన్నికల్లో ఐజ్వాల్ సౌత్ 3 శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయసు గల ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పింది.[3][4]

బారిల్ వన్నెహసాంగి 40 మంది సభ్యులున్న మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి మొదటిసారిగా  2024 మార్చి 7న మహిళ స్పీకర్‌గా నియమితురాలై రికార్డు నెలకొల్పింది.[5]

మూలాలు

మార్చు
  1. NDTV (6 December 2023). "Meet Baryl Vanneihsangi, The Youngest MLA Of Mizoram". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
  2. NTV Telugu (9 March 2024). "జయహో నారీమణి.. చిన్న వయసులో స్పీకర్‌గా ఎన్నిక". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
  3. Financialexpress (6 December 2023). "Meet Baryl Vanneihsangi, an RJ-turned-politician and youngest woman MLA of Mizoram" (in ఇంగ్లీష్). Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
  4. Andhrajyothy (5 December 2023). "ఎవరీ బేరిల్ వన్నెహసాంగి.. టీవీ యాంకర్ నుంచి ఎమ్మెల్యేగా ఎలా ఎదిగింది?". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
  5. Zee News Telugu (9 March 2024). "యాంకర్‌ నుంచి స్పీకర్‌గా.. మిజోరాంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.