బాలకృష్ణ గణేష్ కాపర్దే
బాలకృష్ణ గణేష్ కాపర్దే (1882–1968)[1] భారతదేశం లోని అమ్రావతి కి చెందిన స్వరాజ్ పార్టీ నాయకుడు.
బాలకృష్ణ గణేష్ కాపర్దే | |
---|---|
స్వరాజ్ పార్టీ నాయకుడు |
జీవిత విశేషాలు
మార్చుఆయన వృత్తి పరంగా న్యాయవాది. ఆయన తండ్రి జి.ఎస్.ఖాపర్దే కూడ భారతీయ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడైన బాలగంగాధర్ తిలక్ అనుయాయుడు.[2]
ఆయన 'తిలక్ స్కూల్ ఆఫ్ థాట్' కు చెందినవారు. ఆయన స్వరాజ్ పార్టీ కి చెందిన ముఖ్య నాయకుడు. ఆయన 1923, 1927 లలో రెండవ, మూడవ సెంట్రల్ ప్రొవిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు రెండుసార్లు ఎన్నికైనారు.[1] ఆయన సెంట్రల్ ప్రొవిన్స్ అండ్ బేరర్ కు మంత్రిగా కూడా పనిచేసారు.
రచయితగా
మార్చుఆయన "బాబా భారతి" కలం పేరుతో రచనలు చేసేవారు. ఆ రచనలు మరాఠీ పత్రికలలో ప్రచురితమైనాయి. ఆయన "ప్రం సైన్స్ టు సమాధి" అనే పుస్తకాన్ని వ్రాసారు.
ఆయన "ఆల్ ఇండియా హిందూ మహాసభ" కు అధ్యక్షునిగా ఉండి దేశ వ్యాప్తంగా పర్యటించరు.
ఆయన భద్రీనాథ్ దేవాలయానికి ప్రధాన ట్రస్టీగా పనిచేసారు. ఆయన డెహ్రాడూన్ నుండి హిమాలయాల అంతరంలోనికి సుమారు 120 కిలోమీటర్లు నడచి భద్రీనాథ్ దేవాలయ ద్వారాలను ప్రతి సంవత్సరం శీతాకాలంలో తెరిచేవారు. ఆయన పేరు ఇప్పటికీ దేవాలయం వద్ద సజీవంగా ఉన్నది.
1968లో స్వచ్ఛంద ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఆయన మరణించాడు. [3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Pateriya, Raghaw Raman (1991). Provincial legislatures and the national movement: a study in interaction in ... New Delhi: Northern Book Centre. p. 203 & 216. ISBN 81-85119-58-9.
- ↑ Judith M. Brown. Gandhi's Rise to Power: Indian Politics 1915-1922. p. 340.
- ↑ Dr Suresh Padhye. "About author".