బాలల గేయాలు
తెలుగు సాహిత్యంలో పలు బాలల గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.
చందమామరావే
మార్చు- చందమామ రావే జాబిల్లిరావే
- బండిమీద రావే బంతిపూలు తేవే
- పల్లకిలో రావే పంచదారతేవే
- సైకిలెక్కిరావే సమొసా తేవే
- పడవమీదరావే పట్టుతేనె తేవే
- మారుతీలో రావే మంచి బుక్క్సు తేవే
- పెందలాడరావే పాలు పెరుగుతేవే
- మంచి మనసుతో రావే ముదులిచ్చి పోవే
- అన్నియును తేవే మా అబ్బాయి/అమ్మాయికీయవే
ఏనుగు ఏనుగు నల్లన
మార్చు- ఏనుగు ఏనుగు నల్లన
- ఏనుగు కొమ్ములు తెల్లన
- ఏనుగుమీద రాముడు
- ఎంతో చక్కని దేవుడు
చిట్టి చిలకమ్మ
మార్చుచిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా?
తోట కెళ్ళావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా?
గుటుక్కున మింగావా?
ఉయ్యాలోయ్ జంపాలోయ్
మార్చు- ఉయ్యాలోయ్ జంపాలోయ్
- కొత్తకుండోయ్ కొరెల్లలోయ్
- ఎలోనోయ్ మల్లన్నోయ్ అల్లల్లల్లోయ్.....
ఉడతా ఉడతా ఊచ్
మార్చు- ఉడుతా ఉడుతా ఊచ్
- ఎక్కడికెళ్ళావోచ్
- ఉడుతా ఉడుతా వెంటనె రా..
- చక్కని ఉడుతా వెంటనెరా...
- జామచెట్టు ఎక్కిరా..మంచి పండులాక్కొనిరా..
- సగముపండు నీకూ..సగం పండునీకూ..
- నీవూ నేనూ కలిసి కొరికొరికి తిందాం....
తారంగం తారంగం
మార్చుతారంగం తారంగం తాండవకృష్ణా తారంగం వేణునాథా తారంగం వేంకటరమణా తారంగం వెన్నెలదొంగా తారంగం చిన్నికృష్ణా తారంగం
మాబడి
మార్చు- అదిగోనండీ మాబడి
- నేర్పును మాకు చక్కని నడవడి
- శ్రద్దగ చదువులు చదివెదమండి
- చక్కగ కలిసి ఉంటామండి
- పాఠాలెనో చదివామండీ
- పంచతంత్రం విన్నామండి
- అందులో నీతి తెలిసిందండి
- ఎప్పుడు తప్పులు చేయం లెండి
- చక్కగ బుద్దిగ ఉంటామండి
- మంచి పనులు చేస్తామండీ
- కలిసి అందరం ఉంటామండీ
- ఆనందంగా జీవిస్తామండీ
- తగవులు ఎప్పుడు పడమింకండి
- కలికట్టుగ ఉంటామండి
- కలసి మెలసి పని చేస్తామండి
- కంచుకోట నిర్మిస్తామండి
- కోటకు జండా కడ్తామండి
- ఆకశాన ఎగరేస్తామండి
- ఆ ఎగిరేజండా మాదేనండి
- అదే మా భారత జండానండీ.........
ఒకటి ఒకటి ఒకటి
మార్చుఒకటి ఒకటి ఒకటి మానవులంతా ఒకటి రెండు రెండు రెండు మంచి, చెడులు రెండు మూడు మూడు మూడు మన జెండా రంగులు మూడు నాలుగు నాలుగు నాలుగు వేదాలు మనకి నాలుగు ఐదు ఐదు ఐదు చేతికి వేళ్ళు ఐదు ఆరు ఆరు ఆరు రుతువులు మనకి ఆరు ఏడు ఏడు ఏడు వారానికి రోజులు ఏడు ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిక్కులు, మూలలు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తొమ్మిది గ్రహాల కూటమి తొమ్మిది పది పది పది పాపలు పాడే పాట ఇది
అ'ఆ'ల పాట
మార్చు- అ ఆ లు దిద్దుదాము - అమ్మమాట విందాము
- ఇ ఈ లు చదువుదాము - ఈశ్వరుని కొలుద్దాము
- ఉ ఊ లను దిద్దుదాము - ఉడుతలను చూద్దాము
- ఎ ఏ ఐ అంటూ - అందరనూ పిలుద్దాము
- ఒ ఓ ఔ అంటూ - ఓనమాలు దిద్దుదాము
- అ॰ అః అంటూ - అందరమూ ఆడుదాము
- గురువుగారు చెప్పినా - పాఠాలు చదువుదాము
- మామగారు చెప్పిన - మంచి పనులు చేద్దాము
- తాతగారు చెప్పిన - నీతి కథలు విందాము
- అందరం కలుద్దాం ఆనందంగా ఉందాం.....
తప్పెట్లోయ్ తాళాలోయ్
మార్చుతప్పెట్లోయ్ తాళాలోయ్,
దేవుడి గుళ్ళో బాజాలోయ్,
పప్పు బెల్లం దేవుడికోయ్,
పాలు నెయ్యి పాపడికోయ్.
వానా వానా వల్లప్ప
మార్చువానా వానా వల్లప్ప,
చేతులు చాచు చెల్లప్ప,
తిరుగు తిరుగు తిమ్మప్ప,
తిరుగలేను నరసప్ప.
రంగులు
మార్చుబుజ్జిమేక
మార్చుబుర్రుపిట్ట
మార్చుబుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురము చేయనన్నది
అత్తతెచ్చిన కొత్తచీర కట్టనన్నది
మామతెచ్చిన మల్లెపూలు ముడువనన్నది
మొగునిచేత మొట్టికాయ తింటానన్నది
ఏనుగమ్మ ఏనుగు
మార్చుఏనుగమ్మ ఏనుగు ఏ ఊరెళ్ళిందేనుగు మా ఊరెళ్ళిందేనుగు మంచినీళ్ళు తాగిందేనుగు ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరెళ్ళిందేనుగు మా ఊరెళ్ళిందేనుగు మంచినీళ్ళు తాగిందేనుగు ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు
బొమ్మలమ్మా బొమ్మలు
మార్చుబొమ్మలమ్మా బొమ్మలు రంగురంగుల బొమ్మలు రకరకాల బొమ్మలు సింగారాల బొమ్మలు బంగారు బొమ్మలు ఆడేపాడే బొమ్మలు అందమైన బొమ్మలు నీతిని నేర్పే బొమ్మలు ఖ్యాతిని కూర్చే బొమ్మలు
మనిషిగా పుటిన దెందుకురా?
మార్చుమనిషిగా పుటిన దెందుకురా? మంచిని పెంచేటందుకురా బడికి వెళ్ళే దెందుకురా? చదువులు నేర్చేటందుకురా చదువులు నేర్చే దెందుకురా? జ్ఞానం పొందేటందుకురా జ్ఞానం పొందే దెందుకురా? ప్రగతిని పెంచేటందుకురా ప్రగతిని పెంచే దెందుకురా? చక్కగ బ్రతికేటందుకురా
చుక్ చుక్ రైలు వచ్చింది
మార్చుచుక్ చుక్ రైలు వచ్చింది దూరం దూరం జరగండి ఆగినాక ఎక్కండి జోజో పాపా ఏడవకు లడ్డూ మిఠాయి తినిపిస్తా కమ్మని పాలూ తాగిస్తా.
తప్పెట్లోయ్ తాళాలోయ్
మార్చుతప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుళ్ళో బాజాలోయ్ పప్పు బెల్లం దేవుడికోయ్ పాలు నెయ్యి పాపడికోయ్
దాగుడుమూతలు దండాకోర్
మార్చుదాగుడుమూతలు దండాకోర్ పిల్లీవచ్చె ఎలకా భద్రం ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చిప్....గప్‌చిప్ కళ్ళూమూసి కోలికోల్ ఎక్కడి దొంగలు అక్కడే అణుక్కో ముణుక్కో దాక్కో గప్‌చిప్....గప్‌చిప్
చిట్టీ చిట్టీ చెల్లమ్మా
మార్చుచిట్టీ చిట్టీ చెల్లమ్మా పలకాబలపం తేవమ్మా అక్షరాలు నేర్వమ్మా చదువు బాగా చదవమ్మా తెలివిని బాగా పెంచమ్మా ఇంటికిపేరు తేవమ్మా .
అల్లరిరాజా
మార్చుపండుగలు
మార్చుఏనుగొచ్చింది
మార్చుమంచిగంధం మాచికాయ
మార్చుచిలకల్లు చిలకల్లు
మార్చుఊగు ఊగు గంగెద్దా
మార్చుచేతవెన్న ముద్ద
మార్చుచేతిలో వెన్న ముద్ద - చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి
సందె తాయెతులు - సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణా నిన్ను చేరికొలుతు
పాపాయి కన్నుల్లు కలువరేకుల్లు
మార్చుపప్పు పెట్టి పాయసం పెట్టి
మార్చుఅమ్మకొక ముద్ద
మార్చునల్లని వాడయ్య
మార్చుసంక్రాంతి
మార్చుమనము ధనుర్మాసంలో జరుపుకొనే పండుగ.