బాలాజీ దేవాలయం (కాలిఫోర్నియా)
బాలాజీ దేవాలయం, కాలిఫోర్నియాలోని శాన్ జోస్ ప్రాంతంలోవున్న హిందూ దేవాలయం.
బాలాజీ దేవాలయం (కాలిఫోర్నియా) | |
---|---|
భౌగోళికం | |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం | కాలిఫోర్నియా |
ప్రదేశం | శాన్ జోస్ |
సంస్కృతి | |
దైవం | వేంకటేశ్వరుడు, లక్ష్మి |
చరిత్ర, నిర్వహణ | |
వెబ్సైట్ | అధికారిక వెబ్సైటు |
చరిత్ర
మార్చు2006లో స్వామి నారాయణంద సన్నీవేల్‌లో ఈ దేవాలయాన్ని స్థాపించాడు.[1] 2012 మే 30 నుండి జూన్ 3 వరకు శాన్ జోస్ ప్రారంభించబడింది.[2] శాంటా క్లారా బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్స్, మిల్పిటాస్, సన్నీవేల్ మేయర్‌లలో పనిచేస్తున్న డేవ్ కోర్టేస్ ఈ వేడుకలకు హాజరయ్యారు. కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ నుండి కమ్యూనిటీకి చేసిన సహకారం కోసం దేవాలయం గుర్తింపు ధృవీకరణను కూడా పొందింది.[3]
ఇతర వివరాలు
మార్చుఉచిత యోగా తరగతులు, ధ్యానాన్ని అందించడం ద్వారా సమాజానికి సహాయం చేయడంకోసం 2010లో, ఈ బాలాజీ దేవాలయం బెంగుళూరు నగరంలో ఒక బ్రాంచ్ ప్రారంభించింది.[4] కాలిఫోర్నియాలోని హోలిస్టర్ ప్రాంతంలో 23 ఎకరాల భూమిని ఈ దేవాలయానికి విరాళంగా వచ్చింది. ఈ దేవాలయ ప్రాంగణంలో 2013లో సాయిబాబా, పాండురంగ దేవాలయాలు నిర్మించబడ్డాయి.[5]
పండుగలు
మార్చుఈ దేవాలయంలో శివరాత్రి, నవరాత్రి, దీపావళి వంటి అన్ని ప్రధాన హిందూ పండుగలు జరుగుతాయి. ప్రజలు, సమాజ సంక్షేమానికి అందించిన సేవలకు గురువును గౌరవించడానికి ప్రతిఏటా వార్షిక గురువందన పూజను జరుపుకుంటారు.[6]
మూలాలు
మార్చు- ↑ "Balaji Matha in Sunnyvale welcomes Narayana Swami". one india (in ఇంగ్లీష్). 18 October 2006. Retrieved 19 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Maha Kumbhabhishekam at Balaji Temple". Best Indian American Magazine | San Jose CA | India Currents (in అమెరికన్ ఇంగ్లీష్). 19 July 2012. Retrieved 19 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Balaji Temple Celebrates Mahakumbhabhishekam Anniversary". India West (in ఇంగ్లీష్). Archived from the original on 12 జూలై 2016. Retrieved 19 January 2022.
- ↑ Writer (2012-07-19). "Maha Kumbhabhishekam at Balaji Temple". Best Indian American Magazine | San Jose CA | India Currents (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 19 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "San Jose Balaji Temple Adds New Shrine, Honors Priest". India West (in ఇంగ్లీష్). Archived from the original on 12 ఏప్రిల్ 2020. Retrieved 19 January 2022.
- ↑ "San Jose's Balaji Temple Celebrates 'Guruvandana Program 2018'". India West (in ఇంగ్లీష్). Archived from the original on 12 ఏప్రిల్ 2020. Retrieved 19 January 2022.