బాలానందం (సినిమా)

బాలానందం 1954లో విడుదలైన మూడు ఉప చిత్రాల సమాహారం. ఇది బాలల చిత్రం. ఇందులో బూరెల మూకుడు, రాజయోగం, కొంటె కిష్టయ్య అనే ఉప చిత్రాలున్నాయి. ఈ మూడు చిత్రాలను కలిపి "బాలానందం" గా నిర్మించారు. ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కె.ఎస్.ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఈ చిత్రం 1954 ఏప్రిల్ 24న విడుదలైంది. దీనికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

బాలానందం
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణ సంస్థ ప్రకాష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

బూరెల మూకుడు

మార్చు

ఒక పురోహితుడు శాస్త్రికి ఒకరోజున మూడు రుపాయల పెళ్ళి సంభావన దొరికింది. సంతోషంతో ఆ విషయాన్ని భార్య వెంకమ్మకు చెతుతాడు. వారు ఆ డబ్బుతో బూరెలు వండాలని నిర్ణయించుకుని తమ పక్కింటి వారి దగ్గర బూరెల మూకుడు తీసుకుని వస్తారు. వండిన వెంటనే తిరిగి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంటారు. దానితో బూరెలు చేసి బాగా తింటారు. మరి ఆయాసంతో కదల లేద ఆ మూకుడును పక్కింటి వారికి ఇవ్వడానికి వాటాలు వేసుకుంటారు. ఎవరూ లేవడానికి ఇష్టపడక మౌనంగా కూర్చోవాలని, ఎవరు ముందు మాట్లాడితే వారే ఆ మూకుడును పక్కింటికి ఇవ్వాలని పందెం వేసుకుని కదలకుండా కూర్చుంటారు. ఇంతలో ఒక స్నేహితురాలు పేరంటానికి పిలవడానికి ఇంటికి వస్తుంది. కానీ వారు కదలకుండా, మాట్లాడకుండా ఉంటారు. ఆమె భయపడి వెళ్ళిపోతుంది. యింటి యజమాని అద్దె కోసం వస్తాడు. అయినా వారు ఏమీ సమాధానం చెప్పరు. వారు పోలీసులకు పిర్యాదు చేస్తారు. పోలీసులు వచ్చి ఎంత పిలిచినా పలకరు. అతను వారికి జబ్బు చేసిందనే అనుమానంతో వైద్యుడిని పిలుస్తారు. వైద్యుడు చూసి వారికి ఏ రోగం లేదని నిర్థారించుకుని భూత వైద్యుడి వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చారు. భూతవైద్యుడు సంగతంతా గ్రహించి వాళ్ల గప్ చుప్ భూతాన్ని వదలగొట్టాలనుకుంటాడు. పోలీసు లాఠీ పుచ్చుకుంటాడు. తరువాత జరిగిన ప్రహసనం ఈ కథలొ ఉంటుంది.

  • నా వంతు డబ్బు తేవడం, నావంతు బూర్లు వండటం - నా నోరు ఊటలూరడం, బురెలన్నీ నే తినడం!..

తారాగణం

మార్చు
  • శాస్త్రి : టి.మోహన్
  • వెంకమ్మ: జి.శ్యామల
  • శేషాచలం: రామకృష్ణ
  • పోలీసు: లక్ష్మణ
  • డాక్టరు: వి.రామం
  • భూత వైద్యుడు: మాస్టార్ కుందు
  • పేరంటం: డి.కల్పన
  • స్టుడియో కుక్క.

కొంటె కిష్టయ్య

మార్చు

కిష్టయ్య చాలా మంచి పిల్లవాడు. ఏడాది క్రితం కొంటె పిల్లాడుగా ఉన్న కిష్టయ్య మంచి పిల్లవాడుగా ఎలా మారాడో ఈ కథలో ఉంటుంది.

పాటలు

మార్చు
  • నాటోపీలో ఆ..... నాటోపీలో! (కొంటె కిష్టయ్య పాట)
  • కొనండి బాబూ తినండి బాబూ భలే మంచి మిఠాయీ ... ( మిఠాయి దాదా పాట)
  • పళ్ళోయమ్మా పళ్లు, భలే మంచి పళ్లు ( పళ్లమ్మ పాత)

తారాగణం

మార్చు
  • కిష్టయ్య: మాస్టర్ కుందు
  • లూందీ: వి.రామం
  • మాస్టరు: వి.సుబ్రహ్మణ్యం
  • మిఠాయి దాదా: రామకృష్ణ
  • పళ్లమ్మ: జోగాబాయి
  • తల్లి: పి.లలిత
  • దర్జీ: దొరస్వామి
  • బట్టల వర్తకుడు: పి.రామశేషు
  • చెల్లెలు: రేవతి

రాజయోగం

మార్చు

చందూ కుందూ స్నేహితులు. ఒక జ్యోతిషుడు చందూ చేయి చూసి నీకు రాజయోగం ఉంది. కానీ వెనువెంటనే మరణ గండం కూడా ఉంది అని చెబుతాడు. మరణ గండం ఉందని తెలిసినా భయపడక అతను కుందూను తీసుకొని దేశాటనకు వెళతాడు. ఒక ఊళ్ళో కాలాంతకుడు అనే రాక్షసుడికి భయపడి జనం ఇళ్ళలో ఉండి తలుపులు వేసుకుంటారు. ఈ విషయం పేదరాశి పెద్దమ్మ వలన చందూ తెలుసుకొని ఆ వూరి ప్రజలకు ధైర్యం చెప్పి పౌర్ణమిలోగా ఆ రాక్షసుని ప్రాణాలు తెస్తానని ప్రమాణం చేసి వెళ్తాడు.

దారిలో మంత్ర పర్వతం చేరుతాడు. అక్కడ రాక్షసుడు కుందూను రాయిగా మారుస్తాడు. చందూ రాక్షసుడిని తన యుక్తి వలన జయించి కుందూను విడిపిస్తాడు. కాలాంతకుడి ప్రాణ రహస్యంకోసం ఇద్దరూ ఇంకో గుహలోకి ప్రవేశిస్తారు. పొగలు గ్రక్కుతున్న మృగం తలమీద ఉన్న పంజరంలోని చిలుకను పట్తుకుంటాఅరు. ఆ చిలుక దేవకన్యగా మారి కాలాంతకుడి ప్రానం వాడి బానిస. ప్రాణాంతకుడి కాపలాలో అగ్నిపర్వతంలో ఉంది అని చెబుతుంది. అక్కడికి వెళ్లడానికి మార్గం చూపడానికి ఒక మంత్రపు గజనిమ్మపండును ఇచ్చి మాయమవుతుంది. చందూ, కుందూ ఆ పండు సహాయంతో ఒక ఎగిరే కుర్చీమీద కూచొని ఆకాశమార్గాన వెళ్తారు. త్రోవలో ఆ పండు జారి కింద పడుతుంది. కుర్చీకి మాయ పోతుంది. ఇద్దరూ ఆకాశాన్నుంచి కింద పడతారు. అది ఒక ఉద్యాన వనం. నట్టడవి రాజు కుమార్తె "ఆకాశం మీంచి ఊడిపడ్డవారినే పెళ్ళి చేసుకుంటాన"ని శపథం చేసి ఉంది. కానీ ఉద్యానవనంలో ప్రవేశించ్న పరపురుషుణ్ణి ఉరి తీయాలని రాజుగారి ఆజ్ఞ. చందూను ఉరి తీస్తారా? లేద రాజకుమారికిచ్చి పెళ్ళి చేస్తారా? రాజయోగమా? మరణ గండమా? అనే విషయం మిగతా కథ లో ఉంటుంది.

పాటలు

మార్చు
  • పూచెను పూలవనం, వీచెను మృదుపవనం
  • వీరులు ధీరులు మేమే వీరులు ధీరులు మేమే

తారాగణం

మార్చు
  • చందు, ప్రాణాంతకుడు: రేలంగి సత్యనారాయణబాబు
  • కుందు: మాస్టర్ కుందు
  • అటుకు: రామకృష్ణ
  • చిటుకు: వి.రామమ్
  • రాజు, మాంత్రికుడు: టి;మోహన్
  • ఆస్థాన కవి: ఆనంద్
  • మంత్రి: సుబ్రహ్మణ్యం
  • వరహాలు:జగన్నాథరావు
  • రాకుమారి: బేబీ మల్లిక
  • మంత్రి కూమరి: టి.విజయలక్ష్మి
  • రాణి: ఎం.నిర్మల
  • పెద్దమ్మ: జయశ్రీ
  • దేవత: భార్గవిటాగట్
  • జోస్యుడు: కందా మోహన్
  • శిష్యుడు: ఓగిరాల
  • సైన్యాధిపతి: లక్ష్మణ
  • కాలంతకుడు: వి.సూర్యప్రకాశరావు
  • భూతరాజు: నాగేశ్వరరావు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: ప్రకాశరావు
  • రచన, పాటలు: న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి, ఆరుద్ర
  • ఛాయా దర్శకుడు: జాగీర్దార్
  • శబ్ద దర్శకుడు: ముకుందన్
  • సంగీతం: పెండ్యాల
  • కళ: గౌడగాంకర్
  • నృత్యం : చోప్రా
  • మేకప్: భద్రయ్య
  • స్టిల్సు: సత్యం
  • దుస్తులు: బుచ్చిరాజు
  • ప్రొడక్షన్ మేనేజరు: తిలక్
  • నేపథ్యగానమ్: పి.సుశీల, సరళ, సరోజిని, పత్సల
  • డిస్ట్రిబ్యూటర్: చమ్రియా టాకీసు

మూలాలు

మార్చు
  1. "Balanandham Bhoorelamukudu Rajayogam Konte Kistayya (1954)". Indiancine.ma. Retrieved 2020-09-22.

బాహ్య లంకెలు

మార్చు