బాల్ ఆధార్, ఇది దు సంవత్సరాలలోపు పిల్లలకు కూడా ఆధార్ తరహా గుర్తింపు కార్డు ఇచ్చేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం " బాల్ ఆధార్ " అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది.[1] 0-5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు బాల్ ఆధార్ జారీ చేయబడుతుంది.[2] ఇది నీలిరంగులో కార్డ్. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు బయోమెట్రిక్స్ అభివృద్ధి చెందవు కాబట్టి బాల్ ఆధార్ కు బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు[3]. పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని ప్రభుత్వం సూచించింది.[4] 0-5 సంవత్సరాల మధ్య ఉన్న వివిధ ఉన్న ప్రభుత్వ సబ్సిడీ పథకాల ప్రయోజనాలను పొందేందుకు, రైలు, విమానాల్లో ప్రయాణించడానికి ప్రత్యేక గుర్తింపు కార్డుగా దీనిని వినియోగించుకోవచ్చని తెలియజేసింది. బాల్ ఆధార్ ద్వారా పాఠశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మూలాలు మార్చు

  1. "Aadhaar For Kids: చిన్నపిల్లలకు బాల్ ఆధార్.. ఇలా అప్లై చేసుకోండి.. లేకుంటే తిప్పలే!". Samayam Telugu. Retrieved 2023-12-27.
  2. "How to Apply Blue Aadhaar Card : చిన్నపిల్లల కోసం 'బ్లూ ఆధార్' కార్డులు.. ఇలా అప్లై చేసుకోండి.!". ETV Bharat News. Retrieved 2023-12-27.
  3. "Blue Aadhaar : బ్లూ ఆధార్ అంటే ఏమిటి? దాని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి." The Economic Times Telugu. Retrieved 2023-12-27.
  4. "Blue or Baal Aadhaar: బ్లూ లేదా బాల్ ఆధార్ కార్డ్ అంటే ఏంటి? ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్." News18 తెలుగు. 2022-05-02. Retrieved 2023-12-27.