బాల పాపాంబ
తొలి జీవితం
మార్చుబాల పాపాంబ 16వ శతాబ్ధపు ఉత్తరార్థంలో జీవించివుండవచ్చని చరిత్రకారుల అంచనా. ఈవిడ తల్లిదండ్రులు కామాక్షమ్మ, వీర వసంతరాయలు.
రచనలు
మార్చుఅక్కమహాదేవి అనే యక్షగానాన్ని రచించింది.[2] చరిత్ర పాపాంబ సుమారు 215 గద్య పద్యాలతో యక్షగానం రచించింది. కానీ, ఇది ముద్రించపడలేదు. దీని ప్రతి తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర పాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉంది. (డి.నెం. 1834, 1835).
ఇతర వివరాలు
మార్చుబాల పాపాంబకి యోగశాస్త్రంలో కూడా ప్రావిణ్యం ఉంది. ఈవిడ రాసిన యక్షగానాల్లో జంపె, అట, త్రిపుల, రచ్చరేకులు, ఏకతాళి మొదలైన తాళ ప్రధానమైన దరువులు, ద్విపదలు, వచనములు, కందం వంటి పద్యాలు, అర్థ చంద్రికలు, జోలలు, శోభనాలు, మంగళహారతులు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ దామెర, వేంకట సూర్యారావు. "బాల పాపాంబ". విశిష్ట తెలుగు మహిళలు. రీమ్ పబ్లికేషన్స్. p. 22. ISBN 978-81-8351-2824.
- ↑ 2.0 2.1 నమస్తే తెలంగాణ. "తెలుగు సాహిత్య ప్రక్రియలు - యక్షగానం". Retrieved 21 April 2017.