బాలవ్యాకరణం

తెలుగు వ్యాకరణం
(బాల వ్యాకరణం నుండి దారిమార్పు చెందింది)

పీఠిక ఆంధ్రభాషకు లక్షణ గ్రంథములు ప్రాచీనులు చేసినవి పెక్కులు కానఁబడుచున్నవి. కొన్ని లక్షణ గ్రంథముల పేర్లు మాత్రమిపుడు వినఁబడుచున్నవి. కానఁబడు గ్రంథములందు సంస్కృత సమములకు లక్షణములు బహు తరముగా రచింపంబడినవి గాని తక్కిన భాషకు విశేషాకారముగా రచింపఁబడినవి కావు కాఁబట్టి యా లక్షణ గ్రంథములు చదువు వారికి నిస్సందేహముగా వచన రచన సేయు కౌశలము చిరకాలము బహులక్ష్యములందుఁ బరిశ్రమము చేయక రానే రాదు. భాషా సమిష్టికి లక్షణ గ్రంథము కుదిరిన పక్షమం దంత శ్రమ బడఁ బని లేదు. తుదకు లక్ష్య పరిఙానము చాలని లక్షణ పరిఙానమంత శ్లాఘ్యము కాదు గాని తుదముట్ట సర్వ లక్షణ పరిఙానము లక్ష్య పరిఙానము చేతనే సాధించుట మిక్కిలి దుష్కరము. కాఁబట్టి యిట్టి కొఱఁత వారింపఁ బూని పెక్కు లక్ష్యములు పలుమాఱు సావధానముఁగా పరిశీలించి రచనా ప్రణాళిక నిర్ణయించుకుని నా నేర్పుకొలఁదిని సంస్కృత భాషలో సూత్ర గ్రంథమొకటి కావించితిని. ఆ గ్రంథము బాలురకు సుసాధము గాకుండుట వలన దాని యందలి సూత్రములు కొన్ని తెనిఁగించి ప్రకృత గ్రంథ రూపమున రచించి నాఁడ.

రోహిణీ పబ్లిషర్స్ ప్రచురించిన బాల వ్యాకరణము పుస్తక ముఖచిత్రం.

క. మానితపు నడక పేరిమి

మానసమునకింపుఁ బెంప మను నంచలకున్‌

బోనిడి నీరస నీరము

జానుగ క్షీరంబు గొనుట సహజము కాదే !

శ్రీ హయగ్రీవాయ నమః

క. శ్రీ లతకుం బ్రాఁకై వృష

శైలంబున వెలసి తనదు చాయ కెలయు ధ

న్యాళి దగ మాంచి కోర్కుల

చాలంగా నొసఁగు కల్ప సాలముఁ గొలుతున్‌

క. అనయము లలితోక్తులతో

నొనరు పడం గూర్చి లక్ష్యయోజనమొప్పం

గను బాల వ్యాకరణం

బనఁగా లక్షణ మొనర్తు నాంధ్రంబునకున్‌

క.దిక్ప్రదర్శణముగఁ దెలిపెద నిందు ల

లక్షణము గానఁ బూర్వ కవుల లక్ష్య

ములను లాఁతి లక్ష్మలఁ గాంచి తక్కుల

క్షణ మెఱింగి కొనుండు చతురమతులు

పూర్తి పాఠం

మార్చు
  • వికీసోర్సులో బాలవ్యాకరణం పూర్తిపాఠం ఇక్కడ చూడండి: s:బాల వ్యాకరణము
  • తెలుగుపరిశోధనవారి బాలవ్యాకరణము వెబ్ సైట్ లో వీడియో పాఠాలు చూడండి. బాలవ్యాకరణము