బాహుకుడు (అయోమయ నివృత్తి)
(బాహుకుడు నుండి దారిమార్పు చెందింది)
బాహుకుడు వ్యక్తి పేరు.
- 1. బాహుకుడు: వృకుని కొడుకు. సగరుని తండ్రి. ఇతఁడు శత్రువులవలన రాజ్యమును పోఁగొట్టుకొని భార్యలతోకూడ అడవికి పోయి అచట కాలధర్మము పొందఁగా ఇతని జ్యేష్ఠభార్య సహగమనము చేయ యత్నించెను. అపుడు అచటి ఋషులు ఆవిడ గర్భిణిగా ఉండుట ఎఱిఁగి ఆమెను సహగమనమువలన నివారించిరి. అనంతరము ఆమె పుత్రవతి అగుటకు సవతులు ఓర్వఁజాలక ఆగర్భముచెడునట్లు విషముపెట్టిరి. దానచే గర్భము చెడక మహాబలపరాక్రమ సంపన్నుఁడు అగు పుత్రుఁడు ఉదయించి సగరుఁడు అనఁబరఁగెను. (గరము = విషము, దానితో కూడినవాఁడు సగరుఁడు.)
- 2. బాహుకుడు: నలుఁడు ఋతుపర్ణునివద్ద అశ్వశిక్షకుఁడును, వంటవాఁడును అయి ఉండినప్పుడు వహించిన నామము.
- 3. బాహుకుడు: వేనుని దేహమునందు పుట్టిన నిషాదుఁడు. చూ|| వేనుఁడు.