బిక్కిపళ్ళు
అరుదైన బిక్కి పళ్లకోసం నగర వాసులు అడవి బాట పడుతున్నారు. ఏభయ్ ఏళ్ళకింద మన రాష్ట్రంలో పల్లెల చుట్టూతా చిట్టడవులు, open forestలు. కలేకాయలు, రేగుపళ్ళు, బలుసుకాయలు, రకరకాల అడవిపళ్ళ చెట్లు, కాయలు, పళ్ళతో. ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. నేటితరానికి తెలియని ఎన్నో అపురూపమైన, అద్భుతమైన చెట్లు ఇప్పుడు కనిపించవు. అంతరించిపోతున్న చెట్లలో బిక్కిపండ్ల చెట్లు ఉన్నాయి. అంధ్రదేశం అన్ని ప్రాంతాలలో చిట్టడవుల్లో, నల్లమల అడవుల్లో బిక్కిపళ్ళు మార్చి -ఆగస్టు మధ్య కాస్తాయి. ఈ అడవి చెట్టు ఆకుపచ్చని బూడిదరంగులో ఉంటుంది. ఈ చెట్టు కొయ్యతో దువ్వెనలు, ఆటబొమ్మలు చేస్తారు. ఒక్కో ప్రాంతంలో దీన్ని ఒక్కో పేరుతొ వ్యవహరిస్తారు. బిక్కే, అడవి బిక్కే, కడుబిక్కెమర, కంబి వగయిరా. ఆగ్లంంలో INDIAN BOXWOOD TREE అంటారు. దీని శాస్త్రీయ నామం "గార్డెనియాలాటిఫోనియ ఐటన్" భారత, శ్రీలంక దేశాలలో ఈ చెట్టు కనిపిస్తుంది. షుమారు 20 అడుగులు పెరుగుతుంది. సపోట చెట్టు ఆకుల్లాగా దీని ఆకులు ఉంటాయి. ఈ చెట్టును ఆశ్రయించుకొని పరాన్న జీవులయిన లతలు(బదనికలు) పెరుగుతాయి.
బిక్కికాయలు జామ పిందెలంత ఉంటాయి. మధురంగా ఉండే ఈ పండ్ల గుజ్జు సపోటా పళ్ళ గుజ్జునుపోలి ఉంటుంది. బిక్కిపళ్ళు తింటే శరీరంలో పేరుకుపోయిన మలినాలు పోతాయని పెద్దలు అంటారు. ఇప్పుడు ప్రకృతి వరాలైన బిక్కిపండ్ల లాంటి పండ్లను మనం దూరం చేసుకున్నాము. నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతాలలో బిక్కి పండ్లు కాస్తాయి. 50 ఏళ్ళ క్రితంవరకూ పల్లెలకు దగ్గర్లో అడవులలో ఉన్న ఈ బిక్కి చెట్లు , ఇపుడు కనుమరుగై, దట్టమైన అటవీ ప్రాంతాలలోనే కనిపిస్తున్నాయి.
మూలాలు
మార్చు1.Flora of Peninsular India, Indian Institute of Sciences, అధునాతన శోధన.
2. తూర్పుకనుమల వృక్షసంపుటం
3, పుల్లయ్య, ఇతరులు.