బిడాదరి తీర్మానాలు

ఏప్రిల్ 1942 లో నవజాత భారత జాతీయ సైన్యం స్వీకరించిన తీర్మానాల

1942 ఏప్రిల్‌లో కొత్తగా రూపుదిద్దుకుంటున్న భారత జాతీయ సైన్యం ఆమోదించిన తీర్మానాలను బిడాదరి తీర్మానాలు(Bidadari Resolutions) అంటారు. ఈ తీర్మానాల్లో భారత స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటాన్ని ప్రారంభించే లక్ష్యంతో ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) ఏర్పాటును ప్రకటించింది. ఈ తీర్మానాలను సింగపూర్‌లో, అది జపనీయుల ఆక్రమణలో ఉన్న సమయంలో, అక్కడి బిడాదరిలో ఉన్న యుద్ధ ఖైదీల శిబిరంలో ప్రకటించారు.

సింగపూర్ పతనం

మార్చు

1942 ఫిబ్రవరి 15న సింగపూర్ పతనంతో దాదాపు 45,000 మంది భారతీయ యుద్ధ ఖైదీలు జపాను అధీనం లోకి వచ్చారు. ఈ ఖైదీల లొంగుబాటును, బ్రిటిషు ఖైదీల లొంగుబాటు కంటే విడిగా, మేజర్ ఫుజివారా ఇవైచి, 17 వ తేదీ ఉదయం ఫారర్ పార్క్ ఫీల్డ్‌లో ఆమోదించాడు. ఫుజివారా వారిని, భారత స్వాతంత్ర్యం కోసం విముక్తి సైన్యాన్ని స్థాపించాలన్న భావనను రూపొందించిన మోహన్ సింగ్‌ అధీనం లోకి పంపించాడు. అతను ఆ యుద్ధఖైదీలను తన ప్రతిపాదిత సైన్యంలో చేరమని ఆహ్వానించాడు. పెద్ద సంఖ్యలో దళాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. దీని తరువాత, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ యొక్క సాయుధ విభాగంగా భారత జాతీయ సైన్యాన్ని అధికారికంగా స్థాపించడానికి ప్రణాళికలు ప్రారంభించబడ్డాయి. అయితే, భారతీయ యుద్ధ ఖైదీల్లోని అధికారులు తమ సైన్యం పట్ల జపనీయుల ఉద్దేశాలు, ఆలోచనలు, లక్ష్యాలూ స్పష్టంగా తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

బిడాదరి తీర్మానం

మార్చు

1942 ఏప్రిల్‌లో, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పాటు, ఉద్యమ లక్ష్యాలను నిర్వచిస్తున్న చర్చల ప్రక్రియ ఓవైపు కొనసాగుతూండగానే, మోహన్ సింగ్ తన అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇప్పుడు బిరాదరీ తీర్మానాలు గా పిలుస్తున్న తీర్మానాలను తయారుచేసాడు. మోహన్ సింగ్ దేబ్ ప్రకటించిన తీర్మానం ఇలా ఉంది:[1]

కుల, సమాజ, మత వ్యత్యాసాలకు అతీతంగా భారతీయులు నిలబడ్డారు. స్వాతంత్ర్యం అనేది ప్రతి భారతీయుడి జన్మహక్కు. దాని కోసం పోరాడటానికి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేస్తాం.

కాంగ్రెసు పార్టీ, భారతదేశ ప్రజలూ అడిగినప్పుడు మాత్రమే సైన్యం యుద్ధానికి వెళుతుందని తీర్మానం నిర్దేశించింది. అయితే, జపాన్ దళాలతో సైన్యం ఎలా వ్యవహరిస్తుందో పేర్కొనలేదు.

తీర్మానం ప్రభావాలు

మార్చు

బిడదారి తీర్మానాలను అనుసరించి, భారతీయ యుద్ధ ఖైదీల క్యాంపులు రద్దు చేయబడ్డాయి. అక్కడి సిబ్బందిని మోహన్ సింగ్ నాయకత్వంలో ఐఎన్‌ఎ సుప్రీం కమాండ్‌కు బదిలీ చేసారు. మే 9 న, INA కోసం నియామకాలు ప్రారంభమయ్యాయి. మోహన్ సింగ్, తీర్మానం కాపీలను భారతీయ జవాన్లకు పంపిణీ చేయించాడు. తరువాత మోహన్ సింగ్, ఫుజివారాలు INA లో చేరడానికి దళాలను ప్రోత్సహించేందుకు ప్రధాన భూభాగ శిబిరాలలో పర్యటించారు. జూన్‌లో, బ్యాంకాక్‌లో ఒక కాన్ఫరెన్సు జరిగింది. ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ స్థాపన ప్రకటనను చూసింది. ఇది INAకు జపనీస్ సైన్యానికీ మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా స్థాపించింది. INA అనేది ఐఐఎల్‌ అనే మాతృ సంస్థ యొక్క సాయుధ విభాగమనీ తేల్చింది. ఆ విధంగా బిడాదరి తీర్మానాల ప్రాతిపదిక పైనే INA ఆదేశాలు, తదుపరి ఏర్పడ్డ సంస్థలు నిర్మితమయ్యాయి.

మూలాలు

మార్చు
  1. Fay 1993, p. 94