బిసి స్టడీ సర్కిల్

పేద విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1997లో హైదరాబాద్‌లో ఒక బిసి స్టడీ సర్కిల్‌ను [1] ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇతర ప్రాంతాలలో విస్తరించింది. వీటిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్, స్టాఫ్ సెలెక్షన్ కమీషన్, బ్యాంకింగ్ సర్వీసు మొదలగు పరీక్షలకుశిక్షణ ఇస్తున్నారు. ఎంసెట్ ఎడ్సెట్, కాల్ సెంటర్ మొదలైన వాటికి కూడా శిక్షణ ఇస్తున్నారు.

రాష్ట్ర స్థాయిలో ఐఎఏస్ అధికారి, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షులుగా వుంటారు.

ప్రవేశ పద్ధతి మార్చు

ఆదాయంనిబంధనలకులోబడి వున్న కుటుంబాలలోని విద్యార్థులను స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వివిధ సామాజిక బలహీన వర్గాలకి, స్త్రీలకు, వికలాంగులకు కేటాయింపులు వుంటాయి. ఎంపికైనవారికి, ఉచిత శిక్షణ, వసతి, స్టైఫెండ్, స్టడీ మెటీరియల్ ఇస్తారు.

వనరులు మార్చు

  1. "ఆంధ్ర ప్రదేశ్ పత్రిక పిభ్రవరి 2007 లో వార్త". Archived from the original on 2010-10-02. Retrieved 2010-04-10.