బి.కె.బిర్లా
బసంత్ కుమార్ బిర్లా (12 జనవరి 1921 – 3 జూలై 2019) బిర్లా కుటుంబానికి చెందిన భారతీయ వ్యాపారవేత్త. అతను బి.కె.బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కళాశాల నడుపుతున్న కృష్ణార్పణ్ ఛారిటీ ట్రస్ట్ చైర్మన్. అతను ఖతార్‌లోని బిర్లా పబ్లిక్ స్కూల్, ముంబై సమీపంలోని కళ్యాణ్‌లో బిర్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ స్థాపించాడు.
బసంత్‌కుమార్ బిర్లా | |
---|---|
జననం | కోల్‌కతా, భారతదేశం | 1921 జనవరి 12
మరణం | 2019 జూలై 3 ముంబై | (వయసు 98)
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | వ్యాపారవేత్త |
జీవిత భాగస్వామి | సరళా బిర్లా |
తల్లిదండ్రులు | జ్ఞాన్శ్యాం దాస్ బిర్లా |
సంతకం | |
జీవిత విశేషాలు
మార్చుప్రముఖ దాత ఘనశ్యామ్ దాస్ చిన్న కుమారుడైన బీ.కే.బిర్లా 1921 జనవరి 12న జన్మించాడు. అతను పత్తి, సిమెంట్, ప్లై వుడ్, పేపర్, విస్కోస్, పాలిస్టర్, నైలాన్, పేపర్ షిప్పింగ్, టైర్‌కార్డ్, టీ, కాఫీ, ఏలకులు, రసాయనాలు తదితర రంగాల్లో కీలక వ్యాపారాలను కలిగి ఉన్నాడు. 15 ఏళ్ల ప్రాయం నుంచే పలు వ్యాపార కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించిన బీకే బిర్లా కేశోరాం ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా తన కెరియర్‌ను ప్రారంభించాడు.[1]
ఈసాలతక్కళ్లపల్లి భూముల్లో సున్నపురాయి నిల్వలను గుర్తించిన బిర్లా 1966లో సిమెంటు కర్మాగార నిర్మాణాన్ని ప్రారంభించాడు. వివిధ స్థాయిల్లో పరిశ్రమను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ అభివృద్ధి పథంలో నడిపించినఅతను ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. ఆధ్యాత్మిక భావనతో అనేక దేవాలయాలను పునరుద్ధరించాడు. [2]
1941లో అతను సరళా బిర్లాను వివాహమాడాడు. ఆమె ఉద్యమకారుడు, రచయిత అయిన బ్రిజ్‌లాల్ బియానీ కుమార్తె. వారికి ముగ్గురు పిల్లలు. వారు ఆదిత్య విక్రం బిర్లా, జయశ్రీ మొహ్తా, మంజూషాశృఈ ఖైతాన్.
అతను అనేక పుస్తకాలను కూడాఅ రాసాడు. వాటిలో "స్వాంతా సుఖాయా" అనే జీవిత చరిత్ర ఒకటి.
అతను జూలై 3, 2019 న తన 98వ యేట మరణించాడు. [3]
మూలాలు
మార్చు- ↑ "ప్రముఖ పారిశ్రామికవేత్త బీకే బిర్లా కన్నుమూత".
- ↑ "'కేశోరాం' వ్యవస్థాపకుడు ఇక లేరు". Archived from the original on 2019-07-07. Retrieved 2019-07-07.
- ↑ "Industrialist Basant Kumar Birla passes away". The Times of India. Retrieved 3 July 2019.