ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు బి. ఆర్. చలపతిరావు. ఆకాశవాణిలో చేరడానికి ముందు కేంద్ర ప్రభుత్వంలో చలపతిరావు ఆడియన్స్ రెసెర్చి ఆఫీసర్ గా 1-4-1969 న చేరాడు. 1985 డిసెంబరులో యు.పి.యస్.సి. ద్వారా స్టేషను డైరక్టర్ గా ఎంపిక అయి మంగుళూరు కేంద్ర డైరక్టరుగా చేరాడు. 1987 ఏప్రిల్ లో డైరక్టరేట్ లో వాణిజ్య విభాగం డైరక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఆ పదవిలో దాదాపు 8 సంవత్సరములు జయప్రదంగా పనిచేసి 1994 జనవరిలో పదవీ విరమణ చేశాడు. రచయితగా, వక్తగా, అధికారిగా చలపతిరావు సమర్ధుడు. చలపతిరావు విశాఖపట్టణం లో 12-12-1936 న జన్మించాడు. చలపతిరావు ఢిల్లీ లో స్థిరపడ్డాడు. 1994 నుండి 96 వరకు ఆకాశవాణి సలహాదారుగా వ్యవహరించాడు.