బీఎఫ్ 7
బీఎఫ్ 7 (SARS-CoV-2 Omicron BF.7 variant) అనేది చైనాలో మొదట సెప్టెంబరు 2022లో గుర్తించబడిన కోవిడ్ 19కి కొత్త వేరియంట్.[1] దీనికంటే ముందు ఆగస్టు 2022 నుండి యు.ఎస్.ఎ, ఐరోపాలో ఈ రూపాంతరం హల్‌చల్ చేస్తోంది. ఈ కోవిడ్ 19 వేరియంట్ ఇతర రకాల కంటే వేగంగా వ్యాపిస్తుందని ప్రారంభ అధ్యయనాలు సూచించాయి.[2]
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంటే బీఎఫ్ 7 అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. దేశంలోనూ ఇది నలుగురికి సోకినట్టు నిర్ధారణ అయింది.[3]
లక్షణాలు
మార్చుఒమిక్రాన్ బీఎఫ్ 7 సబ్ వేరియంట్ సోకితే సాధారణ కొవిడ్ లక్షణాలే ఉంటాయి. అంటే జలుబు, దగ్గు. గొంతు నొప్పి వంటివి, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం కూడా రావచ్చు. ముక్కుద్వారా సేకరించే నమూనాల్లో ఇది బయటపడుతుంది.[4]
పుట్టుక
మార్చుప్రధానంగా సార్స్-కొవ్-2 వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో ఆర్346టీ, ఎన్460 అనే రెండు ప్రత్యేక ఉత్పరివర్తనాల కారణంగా బీఎఫ్.7 ఆవిర్భవించింది.
వ్యాప్తి
మార్చుఇది డిసెంబరు 2022 చివరికి బెల్జియం, చైనా, డెన్మార్క్, నార్వే, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, మంగోలియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌లో నివేదించబడింది.[5]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "New COVID variants, BF.7 and BA.5.1.7 found in China; may pose a greater risk, experts fear". The Times of India (in ఇంగ్లీష్). 2022-10-11. Retrieved 2022-10-17.
- ↑ "Highly infectious new Omicron sub variant BF.7 detected in India: Reports". Business Standard (in ఇంగ్లీష్). 2022-10-17. Retrieved 2022-10-17.
- ↑ "Corona BF-7: దేశంలో తాజాగా 4 కరోనా బీఎఫ్-7 కేసులు నమోదు | 4 Corona BF-7 cases in the India anr". web.archive.org. 2022-12-23. Archived from the original on 2022-12-23. Retrieved 2022-12-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "BF7: బీఎఫ్ 7పై ఆందోళన వద్దు". web.archive.org. 2022-12-23. Archived from the original on 2022-12-23. Retrieved 2022-12-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Omicron's new sub-variants BA.5.1.7 and BF.7 are signals to be cautious: Experts". ANI News (in ఇంగ్లీష్). Retrieved 2022-10-17.