బీజామృతం
బీజామృతం విత్తన శుద్ధి కి ఉపయోగించే ఒక ద్రావణం. ఈ ద్రావణాన్ని , విత్తనాలను పంటలో విత్తే ముందు విత్తనానికి ఏ ఇతర శీలింద్రాలు , పురుగులు ఆశించకుండా , ఆరోగ్యంగా మొలకెత్తడానికి విత్తనశుద్ధి గా వాడతారు.
తయారీ విధానం
మార్చుబీజామృత తయారీకి రసాయన రహిత సేంద్రియ పదార్థాలను మాత్రమే వాడుతారు. దేశీయ పశువుల మూత్రం, పేడను మాత్రమే వాడాల్సి ఉంటుంది.
కావలసిన పదార్థాలు
మార్చు1. దేశీయ పశువుల మూత్రం - 5లీ.
2. నీరు - 20లీ.
3. దేశీయ పశువుల పేడ - 5కి.
4. సున్నం - 50 గ్రా.
విధానం
మార్చుఒక పాత్రలో 20 లీ . నీరు , 5 లీ . దేశీయ పశువుల మూత్రం పోసి , 50 గ్రా , సున్నం వేసి బాగా కలియబెట్టాలి . 5 కి . పేడను గుడ్డలో మూటకట్టి ఈ పాత్రలో పూర్తిగా మునిగేటట్టు ఉంచి రాత్రంతా వ్రేలాడదీయాలి . మరునాడు ఉదయం పేడ మూటను అదే పాత్రలో గట్టిగా పిండి , మూటలోని పిప్పిని పడేయాలి . మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి. ఇది నిలువ ఉండదు.[1]
వాడే విధానం
మార్చు1.ఈ ద్రావణాన్ని విత్తనశుద్ధికి వాడాలి
2.నార్ల వేర్లను మిశ్రమంలో ముంచి నాటాలి .
3.విత్తడానికి ముందు విత్తనాలను ఈ మిశ్రమంలో తడిపి , నీడలో ఆరబెట్టి , విత్తుకోవాలి .
4.ఈ ద్రావణం ఒక క్వింటాల్ విత్తనాలకు సరిపోతుంది .
ఉపయోగం
మార్చు1.విత్తనం బాగా మొలకెత్తుతుంది.
2.విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను నియంత్రిస్తుంది.
3.నారుకు వచ్చే తెగుళ్లను నియంత్రిస్తుంది.[2]
మూలాలు
మార్చు- ↑ "బీజామృతం తయారీ ఎలా?". సాక్షి దినపత్రిక 9 Jun, 2014.
- ↑ వివిధ పంటలకు వచ్చే చీడ పీడలు వాటి యాజమాన్య పద్ధతులు. ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.