బీదల ఆస్తి
బీదల ఆస్తి 1955లో విడుదలైన తెలుగు సినిమా. పూర్ణా రిలీజ్ బ్యానర్ పై హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు డి.యల్.రామచందర్ దర్శకత్వం వహించాడు. బేబీ కాంచన, సూర్యకాంతం, బేబీ గిరిజ, రమణారెడ్డి, గుమ్మడి వెంకటేశ్వరరావు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.ఎ.కళ్యాణం, నటరాజన్ లు సంగీతాన్నందించారు.[1] ఈ సినిమా తమిళ సినిమా ఎజైన్ ఆస్తి ని పునర్మించబడిన సినిమా.
బీదల ఆస్తి (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.యల్.రామచందర్ |
---|---|
నిర్మాణం | హెచ్.ఎం.రెడ్డి |
కథ | డి.యల్.రామచందర్ |
చిత్రానువాదం | డి.యల్.రామచందర్ |
తారాగణం | బేబీ కాంచన సూర్యకాంతం బేబీ గిరిజ రమణారెడ్డి గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | టి.ఎ.కళ్యాణం, నటరాజన్ |
నేపథ్య గానం | రోహిణి ఎ.ఎం.రాజా జమునాదేవి |
నృత్యాలు | ఛోప్రా నటరాజన్ రోహిణి |
గీతరచన | అనిసెట్టి పినిసెట్టి శ్రీశ్రీ |
సంభాషణలు | రావూరు, కొవ్వలి |
ఛాయాగ్రహణం | కె.యన్.పోలిగాడ్ (కుట్టి) |
కూర్పు | ఎస్.పి.యన్.కృష్ణ |
నిర్మాణ సంస్థ | పూర్ణా రిలీజ్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- బేబీ కాంచన : లక్ష్మీ
- సూర్యకాంతం : చిత్ర
- బేబీ గిరిజ, చంద్రకుమారి : కాంతి
- హేమలతా దేవి : కమల
- కుమారి తులసి : మాధురి
- మాస్టర్ సుధాకర్, రాజనాల : రఘు
- రమణారెడ్డి : సంజీవి
- దొరస్వామి : వాసు
- గుమ్మడి వెంకటేశ్వరరావు: దయానిధి
- పాతూరి సుబ్బారావు : రాజన్
- ఎం.సి.రాఘవన్: చంద్రయ్య
- రంగస్వామి : రామయ్య
- కాంతారావు : అతిథి నటుడు
- రాజ్యలక్ష్మీ
- పద్మ
- లక్ష్మీకాంతం
- కె.సుబ్బారావు
- సంపత్ కుమార్
- కొండలరావు
- రంగారావు
- కె.వి.రావు
- పి.వి.రమణయ్య
- లక్ష్మయ్యచౌదరి
- కంచి నరసింహం
- వాణీ కుమార్
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత: హెచ్.ఎం.రెడ్డి
- దర్శకుడు: డి.ఎల్.రామచందర్
- స్టుడియో: రోహిణి
- కథ, సినేరియో: డి.యల్.రామచందర్
- మాటలు: రావూరు, కొవ్వలి
- పాటలు: అనిసెట్టి, పినిసెట్టి, శ్రీశ్రీ
- ఛాయాగ్రహణ దర్శకుడు: డి.ఎల్.నారాయణ
- శబ్ద గ్రహణ దర్శకుడు: ఆర్. రాధాకృష్ణ
- ఛాయాగ్రాహకుడు: కె.యన్.పోలిగాడ్ (కుట్టి)
- శబ్ద గ్రాహకుడు: జి.తిరునావకరసు
- కూర్పు: ఎస్.పి.యన్.కృష్ణ
- సంగీతం: టి.ఎ.కళ్యాణం, నటరాజన్
- నృత్యం: ఛోప్రా, నటరాజన్, రోహిణి
- కళ: ఎల్.వి.మాండ్రే
- మేకప్: ఎం.నరాయణస్వామి
- స్టిల్స్: ఈశ్వరబాయి
- దుస్తులు: బాలు
- ప్రొడక్షన్ మేనేజర్స్: పి.వి.రమణయ్య, రంగస్వామి నాయుడు
కథ
మార్చురాజన్ ఒక మామూలు బడి పంతులు. అతని చిన్నతనంలోనే తల్లి పోయింది. ఆమె చనిపోయే ముందు ఆస్తినంతటినీ రాజన్ మేనమాత రామయ్యకు అప్పగించింది. కానీ తన కూతురు చిత్రను పెళ్ళి చేసుకోలేదని ఆ ఆస్తినంతటినీ కాజేసాడు రామయ్య. అప్పట్నుంచీ రాజన్ రామయ్య గుమ్మం తొకాలేదు. రాజన్ భార్య కమల, కొడుకు ఆనంద్ తో ఉన్నంతలో కులాసాగా సంసారం గడుతుతున్నారు
చిత్ర భర్త వాసు వకీలు. వారి కొడుగు రఘు. కొడుకంటే తల్లికి ఎంతో గారాబం. వాళ్ళ యింట్లో పనిచేస్తున్న కాంతిని ప్రేమించాడు రఘు. అతను చెడు మార్గాల్లోకి పోవడానికి అకరణం తల్లి గారాబమే.
రామయ్య చనిపోయే ముందు ఆస్తినంతనీ రాజన్ పేర వీలునామా రాసాడు. కానీ దానిని చిత్ర కాల్చి వేసింది. ఆమె పగ అంతతో చల్లారలేదు. తనకు స్కూలు బోర్డులో ఉన్న పలుకుబడితో రాజన్ ఉద్యోగం తీయించేస్తుంది.
ఉద్యోగం పోయిన రాజన్ మంచం పట్టాడు. ఇంటి అద్దెలేదని సామాన్లను బయట పడవేస్తున్న బిల్లు కలక్టర్లను మందలించి, ఆనంద్ కు తన మిల్లులో పని యిస్తాడు ఆ ఇంటి యజమాని దయానిధి.
మిల్లులో చేరిన తర్వాత మిల్లు గేట్ కీపరు చంద్రయ్యతో పరిచయం ఏర్పడుతుంది. ఆనంద్ కు. చంద్రయ్య కూతురు కాంతిని ఆనంద్ తన చెల్లెలుగా ప్రేమిస్తాడు.
మిల్లులో "ఆఫీసు బాయ్" గా చేరిన ఆనంద్, పెరిగి పెద్దవాడై తన తెలివి తేటలు వల్ల మిల్లు మేనేజరు అవుతాడు. దయానిథి కూతురు లక్ష్మీ ఆనంద్ ను ప్రేమిస్తుంది.
చిన్నప్పట్నుంచీ చెడు మార్గాల్లో పెరిగిన రఘు పెద్దవాడయ్యే సరికి, అన్ని దుర్వ్యయాలకు ఇంట్లోంచి డబ్బూ, నగలూ ఎత్తుకు పోయాడు. చివరకు తన తండ్రికి ఎవరో కోర్టులో కట్టవలసిందని యిచ్చిన పాతిక వేలూ ఎత్తుకు పోయి మాధురి అనే నర్తకికి యిస్తాడు. ఈ డబ్బు కోర్టులో కట్టలేక ఆత్మహత్య చేసుకుంటాడు తండ్రి
తండ్రి పోయిన తరువాత ఆ మాధురిని తీసుకొచ్చి ఇంటిలో పెడతాడు. తల్లి ఆమె బూట్లకు పాలిష్ చెయ్యలేదని య్హింట్లోంచి గెంటేస్తాడు. రఘు దగ్గర డబ్బంతా అయిపోయింది. సంజీవి సలహా ప్రకారం ఆనంద్ ద్వారా మిల్లులో ఉద్యోగం సంపాదిస్తాడు.
మిల్లులో చేరిన తర్వాత, ఆనంద్, లక్ష్మీల ప్రేమను నాశనం చెయ్యాలని లక్ష్మీ హృదయాన్ని ఎలాగైనా చూరగొనాలనీ ఆశపుట్టింది రఘుకు. కానీ చిన్ననాతి ప్రేయసే కాంతి తన మూలంగా గర్భవతి అయింది. 'పెళ్ళి చేసుకో' మని బలవంతం చేయడాం చేత ఈ రహస్యం లక్ష్మీకి తెలియకుండా ఉండాలని ఆమెను సంజీవి ఇంట్లో దాస్తాడు.
చిన్నప్పట్నుంచీ కాంతిని చెల్లెలుగా భావిస్తున్న ఆనంద్ ఆమెను వెదకడానికి వెళ్ళి మిల్లుకు రాడు. రఘు దీన్ని అదనుగా తిసుకొని "ఆనంద్ కాంతిని ప్రేమిస్తున్నాడని లక్ష్మీ చెవిలో నూరి పోస్తాడు. పన్నాగం పన్ని ఆనంద్ నూ, కాంతినీ సంజీవి ఇంట్లో సమావేశపరచి, లక్ష్మిని తీసుకొచ్చి చూపిస్తాడు. కాంతిని ఆనంద్ ప్రేమిస్తున్నాడని నమ్ముతుంది లక్ష్మి. అతని ఉద్యోగం తీసేస్తుంది. ఇది తెలిసిన ఆనంద్ కాంతిని తీసుకువచ్చి తన సోదర ప్రేమను ఋజువు చేస్తానని వెడతాడు కాంతి కోసం.
కానీ అతను అక్కడకు వెళ్ళే సరికి, రఘు చేతి బాకుపోతుతో నేలకూలి ఉంటుంది కాంతి. ఈ హత్యా నేరం ఆనంద్ మీదకు వస్తుంది.
కాంతి చనిపోయే ముందు నిజాన్ని చిత్రకు చెబుతుంది. కాని, ఆ నిజాన్ని బయట పెడితే కన్న కొడుకు ప్రాణం పోతుందే!
కొడుకూ కోసం ఆమె నిజాన్ని దాస్తుందా లేదా, ఆనంద్ కు శిక్ష పదుతుందా, దోషి రఘు దురాశలు ఫలిస్తాయా అనేది మిగిలిన సినిమా భాగం.
పాటలు
మార్చు- వెన్నెల రేడా! వేగరవా! ఆడగరా! రావు? : రచన: శ్రీ శ్రీ, గాయని: రోహిణి.
- శుభమంగళమాయె నేడే - ధరణీ మాత కావరావే : రచన : శ్రీ శ్రీ, గాయని. ఎ.పి.కోమల
- నీమీద మనసు నిల్చెనే ఏమందువే ని వేమందువే : రచన: శ్రీశ్రీ, గాయకులు: రోహిణి, జమునాదేవి
- జగాలేలు దేవరా, శ్రీకరా! ఉదయారుణ దేవా : రచన: శ్రీశ్రీ, గాయకులు: ఎ.ఎం.రాజా, రోహిణి
- రావో నారాజా! ఇదే ఇదే వేళ : రచన: శ్రీశ్రీ, గాయని: రోహిణి
- హాయి హాయిగా ఆడనా పాడనా: రచన: శ్రీ శ్రీ, గాయని: రోహిణి
- హాయి హాయిగా ఆడనా పాడనా: రచన: అనిసెట్టి, పినిసెట్టి, గాయని: రోహిణి
- మదిలోన కల్లోలమేలా? మనకేలా? కన్నీరిదేలా? : రచన: అనిసెట్టి, పినిసెట్టి, గాయని: రోహిణి
- అమ్మను మించిన ఉన్నత దైవం: రచన: అనిసెట్టి, పినిసెట్టి, గాయకుడు: ఎ.ఎం.రాజా.
మూలాలు
మార్చు- ↑ "Beedhala Aasthi (1955)". Indiancine.ma. Retrieved 2021-05-27.