బీనాదేవి (జ: 1935) తెలుగు రచయిత్రి. ఈమె అసలు పేరు భాగవతుల త్రిపురసుందరమ్మ. ఈమె భర్త భాగవతుల నరసింగరావుతో కలిసి అనేక రచనలు చేశారు. ఈమె, భర్తా ఇద్దరూ కలిసి బీనాదేవి అనే కలం పేరుతో రచనలు చేసారు.

బీనాదేవి విశాఖపట్నంలో 1935 ఫిబ్రవరి 11 న జన్మించింది. ఈమెపై రాచకొండ విశ్వనాథశాస్త్రి ప్రభావం ఎక్కువ.[1]

భర్త మరణం తర్వాత 1990 నుండి స్వయంగా కథలూ, వ్యాసాలూ రాస్తూ బీనాదేవి కథలూ-కబుర్లూ సంపుటిని వెలువరించారు.

1972 లో వీరికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

మూలాలుసవరించు

  1. "బీనాదేవి". Archived from the original on 17 Jun 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=బీనాదేవి&oldid=2948489" నుండి వెలికితీశారు