షెడ్యూల్డ్ కులాల జాబితాలో 9వ కులం బేడ బుడగ జంగం. బుడిగ, బేడ ఇలా రెండు రకాలుగా పిలువబడతారు.వీరు బుర్ర కథలు చెబుతారు. పగటివేషాలు . బిక్షాటన ఇవన్నీ వీరి కుల వృత్తులు. వీరికి సొంత భాష ఉంది.

 
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో బుర్రకథ కళాకారుల ప్రదర్శన

వీరి కళలు ఇంతకు ముందు జంగం కథలుగా ఈ నాడు, బుర్రకథగా పిలువబడుతున్నాయి. ఒకనాడు మత ప్రభోధానికి, దేశభక్తికీ ప్రతిబింబంగా నిలబడిన జంగంకథా కళారూపం రాను రాను యాచనకూ, వుదర పోషణకూ ఉపయోగ పడి తిరిగి ఈ నాడు దేశభక్తిని ప్రబోధిస్తూ, ప్రజా సమస్యలను చిత్రిస్తున్నది. జంగం కథలు చెప్పే వారిని బుడిగె జంగాలని పిలుస్తారు. బుడికెను కంచుతో గానీ ఇత్తడితో గానీ తయారు చేస్తారు. గుమ్మెటకకు ఒక వైపున బెత్తపు చత్రాన్ని బిగించి, తోలుతో మూస్తారు. రెండప ప్రక్కన కూజామూతిలాగా, అనాచ్ఛాతీతంగా వుంటుంది. కథకునికి ఇరు ప్రక్కలా వున్న వంత గాళ్ళు ఒక్కొక్కరూ తమ గుమ్మెటను చంకకు తగిలించు కుంటారు. కుడిచేతి వ్రేళ్ళతో, చర్మము పైన వాయిస్తూ రెండవ ప్రక్క మూస్తూ గుంభనగా శబ్దాన్ని తెప్పిస్తారు.


కథ చెప్పె బుడిగె జంగం నిలువుటంగీ తొడిగి, తలపాగాచుట్టి, కాళ్ళకు గజ్జెలు, మువ్వలు కట్టుకుని, భుజంమీద తంబురాను ధరించి, చేతి వ్రేలికి అందెలు తొడిగి, వాటిని తంబురాకు తట్టుతూ రెండవ చేతితో తంబురా తీగను మీటుతూ కథను ప్రారంబిస్తారు. కథకునికి వంతలుగా వున్న వారు గుమ్మెటలు ధరించి కథకునికి పంత పాడుతూ, పాట వరుస ననుసరించి గుమ్మెటలను వాయిస్తూ మధ్య్త మధ్య హాస్యగాడు చలోక్తులతో హాస్యాన్ని క్రుమ్మరిస్తూ, ప్రేక్షకుల్ని నవ్విస్తూ వారి మెప్పు పొందు తాడు. [1]

ఇవీ చూడండి

మార్చు

జంగం (కులం)

వనరులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "  బుడిగె జంగాలు".   తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్. 1992. 
"https://te.wikipedia.org/w/index.php?title=బుడగ_జంగం&oldid=4352611" నుండి వెలికితీశారు