బుడ్డాయిపల్లె (ప్రొద్దుటూరు)

బుడ్డాయిపల్లె కడప జిల్లా ప్రొద్దుటూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామానికి చెందిన శ్రీ చాడా చెన్నకృష్ణారెడ్డి, ప్రమాదవశాత్తూ చిన్న వయస్సులోనే అసువులుబాసిన తన ఏకైక పుత్రిక చంద్రకళావతి ఙాపకార్ధం, ఒక ఆలయం కట్టించదలచుకున్నారు. గోపవరం పాంచాయతీ పరిధిలోని యానాదికాలనీలో, మూడువేల జనాభా ఉన్నా, ఆలయం లేదని తెలుసుకొని, అక్కడ, రు. 40 లక్షల వ్యయంతో, శ్రీ కోదండరామాలయం నిర్మించినారు. ఈ ఆలయాన్ని 2013లో ప్రారంభించినారు. ప్రస్తుతం ఆలయం చుట్టూ, ఆహ్లాదకరంగా చెట్లు, పూలమొక్కలు పెంచినారు. నిత్యం పూజలు చేసేటందుకు, నెలకు ఏడువేల రూపాయల జీతమిచ్చి, అర్చకులు, సిబ్బందిని నియమించినారు.

ఈ గ్రామానికి చెందిన గంగుల భువన్‌రెడ్డి అను విద్యార్ధి,2020, అక్టోబర్-5న ప్రకటించిన జె.ఇ.ఇ.అడ్వాన్స్‌డ్ పరీక్షా ఫలితాలో,396 మార్కులకుగాను 345 మార్కులు సంపాదించి, జాతీయస్థాయిలో 2వ ర్యాంక్ సాధించినాడు. ఈ విద్యార్ధి తండ్రి ప్రభాకరరెడ్డ్ చిరువ్యాపారి,తల్లి గృహిణి.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు