బుదౌన్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బుదౌన్ జిల్లా (హిందీ:बदायूँ जिला) ఒకటి. బుదౌన్ పట్టణం ఈ జికుల్లా కేంద్రం. ఇది బరైలి డివిజన్‌లో భాగంగా ఇంది. జిల్లా వైశాల్యం 5168 చ.కి.మీ
బదాయూన్ జిల్లా
बदायूँ जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | బరేలీ |
ముఖ్య పట్టణం | బదాయూన్ |
మండలాలు | 6 |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
విస్తీర్ణం | |
• మొత్తం | 5,168 కి.మీ2 (1,995 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 37,00,245 |
• జనసాంద్రత | 720/కి.మీ2 (1,900/చ. మై.) |
• Urban | 8,26,000 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 52.91 per cent |
ప్రధాన రహదార్లు | SH33, SH43, SH51, SH18, NH 93 |
Website | అధికారిక జాలస్థలి |
పేరు వెనుక చరిత్ర
మార్చుయునైటెడ్ కింగ్డం చారిత్రక పరిశోధకుడు " గార్జ్ స్మిత్ " వ్రాతలను అనుసరించి ఈ ప్రాంతానికి అహిర్ రాకుమారుడు బుధ్ ఙాపకార్ధం ఈ నగరం స్థాపించబడిందని భావిస్తున్నారు. [1]
చరిత్ర
మార్చు1911 ఎంసైక్లోపీడియా బ్రిటానికా బదాయూన్ గురించి వ్రాసింది. ఈ ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో " యునైటెడ్ ప్రోవింస్ ఆఫ్ ఆగ్రా , ఔధ్ " లోని రోహిల్‌ఖండ్ భూభాగంలో ఉంది. ఈ పట్టణం సాత్ నది ఏడమ తీరంలో ఉంది. 1901లో జనసంఖ్య 39,031. ఇక్కడ బృహత్తరమైన కోటశిథిలాలు, 1223లో నిర్మించబడిన అందమైన మసీదు ఉన్నాయి. శిలాశాసనాల ఆధారంగా 905లో బౌధ్ స్థాపించబడింది. 12 వ శతాబ్దం వరకూ సాగిన బౌధ్ పాలనలో 12 మంది రాధోడ్ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని భావిస్తున్నారు. 1196లో మొదటిసారిగా ఈప్రాతం మీద కుతుబుద్దీన్ ఇతుత్మిష్ దాడిచేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. తరువాత ఈ ప్రాంతం ఢిల్లి సామ్రాజ్య ఉత్తర భూభాగంలో ప్రముఖ స్థానం వహించింది.13వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజప్రతినిధులు షాంసుద్ధీన్ ఇతుతుమిష్ ఆయన కుమారుడు రుకుద్దీన్ ఫిరుజ్ సిహాసనం అధిష్టించారు. 1571లో ఈ పట్టణం అగ్నిప్రదానికి లోనైంది. ఒక శతాబ్దం తరువాత షాజహాన్ చక్రవర్తి అధికారాన్ని షహస్పూర్ - బిలరికి బదిలీ చేసాడు.
ప్రొఫెసర్. గోతి జాన్ ఈ నగరానికి " బేదామూథ్ " (बेदामूथ) అని పేరున్నట్లు పేర్కొన్నాడు. లక్నో మ్యూజియంలో ఉన్న పురాతన శిలాశాసనంద్వారా ఈ ప్రాంతం పాంచాల రాజ్యంలో భాగంగా ఉందని తెలుస్తుంది. నగరానికి సమీపంలో ఉన్న శిలాశాసనం అనుసరించి ఈ ప్రాంతం పేరు బద్గౌన్లక్ అని ఉంది. ముస్లిం పరిశోధకుడు (इतिहासकार), రోజ్ ఖాన్ లోడి ఇక్కడ అశోకుడు బుధ్‌మౌ (बुद्धमउ) పేరుతో బుద్ధ విహారం నిర్మించాడని భావిస్తున్నారు. బదాయూన్ నగరం పవిత్ర గంగా తీరంలో ఉంది..[2]
ఆర్ధికం
మార్చు2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బదాయూన్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
విభాగాలు
మార్చు- జిల్లాలో 6 ఉపవిభాగాలు ఉన్నాయి: సహస్వన్, దతగంజ్,బిల్సి, బిసౌలి, బదాయూన్,
- జిల్లాలో 7 శాసనసభ జియోజక వర్గాలు ఉన్నాయి:- బిసౌలి, సహస్వన్, బిల్సి, బదాయూన్, షెఖుపుర్, దతగంజ్.
- అయొన్ల పార్లమెంటు నియోజకవర్గంలో: షెఖుపుర్, దతగంజ్ ఉన్నాయి.
- బదాయూన్ పార్లమెంటు నియోజకవర్గంలో: మిగిలిన శాసనసభ జియోజక వర్గాలు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,712,738,[4] |
ఇది దాదాపు. | లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | ఒక్లహోమా నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 71వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 718 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 20.96%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 859:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 52.91%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జిల్లాలో ముస్లిములు, యాదవులు అధికంగా ఉన్నారు. బదయూన్ నగర జనసంఖ్య (3.61 లక్షలు), ఉజ్జయిని (2.01లక్షలు),సహస్వన్ (2.24 లక్షలు), కక్రాల (1.24 లక్షలు). బదయూన్ 27% నగరప్రాంత, 28% నగర శివారు ప్రాంతం మిగిలిన 45% గ్రామీణప్రాంతాలకు చెందినవారు.
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ John Murray, The student's geography of India: the geography of British India: political and physical (George Smith: 1982), p. 180
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-21. Retrieved 2014-12-16.
- ↑ 3.0 3.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Liberia 3,786,764 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Oklahoma 3,751,351