బుద్ధవనం మ్యూజియం
బుద్ధవనం మ్యూజియం తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రాంతంలో ఉన్న మ్యూజియం.[1] నాగార్జున సాగర్ ఆనకట్టకు సమీపంలో ఉన్న నందికొండ గ్రామం ఒకప్పుడు ఇక్ష్వాకు రాజవంశంలో భాగంగా ఉంది. స్తంభాల మందిరాలు, మఠాల వంటి అనేక బౌద్ధ నిర్మాణాలు కనుగొనబడిన తర్వాత ఈ ప్రాంతం ప్రాముఖ్యతను సంపాదించుకొంది. నాగార్జున సాగర్ ఆనకట్ట కుడి ఒడ్డున ఉన్న కాలువ త్రవ్వకాలలో వెలికితీసిన అవశేషాలు ఈ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి.[2]
బుద్ధవనం మ్యూజియం | |
---|---|
స్థాపితం | 14 మే, 2014 |
ప్రదేశం | నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా, తెలంగాణ, భారతదేశం |
రకం | మ్యూజియం |
సందర్శకులు | ప్రజా |
చరిత్ర
మార్చుబుద్ధుడు నివసించిన కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వికసించింది. భారతదేశంలోని పురాతన బౌద్ధ నాగరికతలకు నిలయంగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాంతంలో 1950వ దశకంలో ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక చారిత్రాత్మక నాణేలు, కళాఖండాలు లభించాయి. ఆ కళాఖండాలను భద్రపరచే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ వారసత్వ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ డ్యామ్ సమీపంలోని బుద్ధవనంలో[3] 2014, మే 14న బుద్ధ జయంతి వేడుకల సందర్భంగా బౌద్ధ వారసత్వ మ్యూజియం అధికారికంగా ప్రారంభించబడింది.[4] జాతక కథలు, అజంతా, ఎల్లోరా గుహల్లో ఉన్న చిత్రాలు, శిల్పాలు, జనపదాల్లో వ్యవహారంలో ఉన్న కథలలోని ఘట్టాల ఆధారంగా ఈ బుద్ధవనంలో కళాకృతులను రూపొందించారు.[5]
సేకరణలు
మార్చుబౌద్ధ థీమ్ పార్కుగా పేరొందిన బుద్ధవనంలోని ఈ మ్యూజియంలో బౌద్ధ శిల్పాలు, బౌద్ధ టాంకులు, కాంస్యాలు, పాల, గాంధార శిల్పాలు, అజంతా చిత్రాలు, రాతి శిల్పాలు మొదలైనవి భద్రపరచబడ్డాయి. బౌద్ధమత స్థాపకులలో ఒకరైన ఆచార్య నాగార్జునుడు నివాసమున్న ఈ ప్రాంతపు వారసత్వాన్నీ, వైభవాన్ని ప్రతిబింబించే టైంలెస్ స్మారక చిహ్నాలు, శిల్పాలను కాపాడటం కోసం ఇక్కడ కొత్త గ్యాలరీలు ఏర్పాటుచేయబడ్డాయి. ప్రత్యేకమైన మ్యూజియంలో అవతార్ ధ్యానంలో భగవంతుడు గౌతమ బుద్ధుని ఆకర్షణీయమైన శిల్పాలు ఉన్నాయి,
సందర్శన వివరాలు
మార్చుప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. శుక్రవారం, పబ్లిక్ హాలిడేస్‌లో మ్యూజియం మూసివేయబడుతుంది.[6]
ఇవీ చూడండి
మార్చు
మాలాలు
మార్చు- ↑ India, The Hans (2020-11-06). "World's largest Buddhist heritage theme park on the anvil in Telangana". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-18.
- ↑ Telangana Tourism, Telangana (7 February 2019). "Unique Museum of Buddhist Heritage". www.telanganatourism.gov.in. Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
- ↑ "Govt to develop Buddhist sites across Telangana". The New Indian Express. Retrieved 2021-09-18.
- ↑ Department of Heritage Telangana, Museums. "Buddhist Heritage Museum, Buddavanam". www.heritage.telangana.gov.in. Archived from the original on 27 January 2021. Retrieved 18 September 2021.
- ↑ సాక్షి, హైదరాబాద్ (5 April 2021). "సిద్ధయానం". Sakshi. వాకా మంజులారెడ్డి. Archived from the original on 13 April 2021. Retrieved 18 September 2021.
- ↑ "Buddhist Heritage Museum". map.sahapedia.org (in ఇంగ్లీష్). Retrieved 2021-09-18.