బుద్ధావతారము

(బుద్ధ అవతారము నుండి దారిమార్పు చెందింది)


ఈ వ్యాసంలో ఏకవింశతి అవతారములులో ఒక అవతారముగా బుద్ధుని గురించి చెప్పబడింది. బౌద్ధమతం స్థాపకునిగా బుద్ధుని గురించి గౌతమ బుద్ధుడు వ్యాసం చూడండి. గౌతమ బుద్ధుని అవతారము, దశావతారములలో ఒకటి కాదు. బుద్ధుడు, గౌతమ బుద్ధుడు అవతారాలు, రూపాలు వేరు !


బుద్ధావతారము విష్ణువు దశావతారాలలో ఒకటి.

దశావతారాలలో ఒకటైన బుద్దావతారము

బుద్దావతారము క్షణ కాలము మాత్రమే ఉంది. విష్ణుమూర్తి రాక్షసుని చంపడానికి దిగంబర అవతారము ఎత్తుతాడు. అందుకని ఈ అవతారమును పూజించరు. అంతకు ముందరి అవతారమైన కృష్ణావతారమును పుజిస్తారు. కృష్ణార్పణం అంటారు. బుద్దార్పణం అనరు.

పురాణ గాథసవరించు

త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేక పోతారు.అప్పుడు ఆ శక్తిని ఉపసమ్హరింప చేయ్యడానికి లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు. ఇదే విషియం "ఆపన్నివారక స్తోత్రము "లో ఉంది. "ద్వైత్యస్త్రీమనభంజినే" అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడు అని అర్ధం.

అన్నమయ్య వర్ణనసవరించు

పైన వృత్తాంతాన్ని అన్నమయ్య "దశావతార వర్ణనలో" పేర్కొన్నాడు.

'పురసతుల మానములు పొల్లజేసినచేయి.
ఆకాసాన బారేపూరి
అతివలమానముల కాకుసేయువాడు"
ఆకాసాన విహరించే ఊరులు - త్రిపురాలు.
వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు.

అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు