బులుసు సోమయాజులు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
బులుసు సోమయాజులు (1935 - 1996) ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు.
వీరు 1935 ఆగష్టు 6 తేదీన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జన్మించారు. వీరు కాకినాడలో పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాలలో విద్యాభ్యాసం చేసారు. తదుపరి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంలో ఉన్నత విద్యని అభ్యసించారు. అంక గణితం, బీజ గణితం, రేఖా గణితము, జ్యామితి, సంభావ్యత, కలన గణితం తదేతర గణిత శాఖల్లో నిష్ణాతులు.
1969 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయానుసారం చేబట్టిన తెలుగులో విద్యాబోధనకు అంకురార్పణ చేసిన గ్రంథకర్తల బృందంలో అగ్రగణ్యులు. అదేవిధంగా, పంజాబు యూనివర్సిటీలో ఆచార్యులు ఆర్. పీ. బాంబా గారి ఆధ్వర్యంలో అనేక పుస్తకాలని రచించారు.
వీరు 1972లో అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ విద్యాలయంలో డాక్టరేట్ చదువులు అభ్యసించేందుకు వెళ్ళి 1978 లో స్వదేశానికి తిరిగి వచ్చేరు. గణితశాస్త్ర ప్రాచుర్యానికి, జనబాహుళ్యానికి అందుబాటులో ఉండేందుకు వీరు అవిరళ కృషిచేసారు.