బూఖొ పై అనేది లేత కొబ్బరితో చేసే సంప్రదాయ ఫిలిపినో వంటకము. ఫిలిపిన్స్‌లోని లుసొన్ దీవిలోని లగూన ప్రొవిన్స్‌లో గల లొస్ బఞొస్ నగరం ఈ వంటకానికి పేరొందింది. [1]

బూఖొ పై
రకంపై
Courseఅంత్యఖాద్యం
మూల స్థానంఫిలిపీన్స్
ప్రాంతం లేదా రాష్ట్రంలగూన ప్రొవిన్స్, లుసొన్
సృష్టి కర్తSoledad Pahud
Serving temperatureచల్లగా
మూల పదార్థాలుPie shell, custard, లేత కొబ్బరి, తియ్యటి గడ్డపాలు
display: inline-block; line-height: 1.2em; padding: .1em 0; width: 100%;290 kcal (1214 kJ)
Cookbook:బూఖొ పై  బూఖొ పై

బూఖొ అంటే టగాలొగ్ భాషలో లేత కొబ్బరి అని అర్థం. కొబ్బరితో పాటు తియ్యటి గడ్డపాలు వాడడంతో ఇది మీగడతో చేసే కస్టర్డ్ పైల కన్నా మందంగా ఉంటుంది. ఈ బూఖో పైలో వాడే పదార్థాల్లో చిన్న మార్పులు చేస్తే మరికొన్ని రకాలు తయారవుతాయి. మచ్చుకు మఖపునొ పై అనేది మఖపునొ అని మందంగా, జిగురుగా ఉండే ఒక రకం కొబ్బరికాయతో చేసే బూఖొ పై. [2]

ఒకప్పుడు ఫిలిపీన్స్‌లోనే దొరికే ఈ వంటకాన్ని, నేడు బ్లాస్ట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ వాడి నిలవ ఉంచగలగడంతో తయారీదారులకు దీన్ని ఎగుమతి చేసే అవకాశం దొరికింది. [3][4] పాడవకుండా నిలవ ఉంచే వీలు ఉండడంతో ఫిలిపీన్స్ నుండి తిరిగి వెళ్ళే పర్యటకులు దీన్ని తమకు కావలసిన వాళ్ళకి బహుమతిగా తీసుకెళ్ళే అవకాశం దొరికింది. [5] ఇలా ఇంటికి తిరిగివస్తూ, సొంత మనుషులకు బహుమతులు తీసుకువచ్చే ఫిలిపినో సంప్రదాయాన్ని పసలూబొంగ్ అంటారు. నేడు దీన్ని పెండన్, వనిల, బాదం ఫ్లేవర్లలో కూడా తయారు చేస్తున్నారు.

బుఖో పై లాంటిదే అమెరికన్ కొకొనట్ క్రీమ్ పై. కానీ రెండిటికీ కొన్ని తేడాలు ఉన్నాయి. ఒకటి బుఖో పైలో క్రీమ్ ఉండదు. ఇంకొకటి, బుఖో పై మీద మరెఁగ్ గాడులు ఉండవు. [6]

పుట్టుపూర్వోత్తరాలు

మార్చు
 
సెన్ ఫ్రన్సిస్కొలో బుఖో పై

బుఖో పై మొదటిసారి ఫిలిపీన్స్‌లోని లగూన ప్రొవిన్స్‌లో తయారుచేయబడింది అని అంటుంటారు.

మూలాలు

మార్చు
  1. "Pilgrimage for pies!". Flexicover. Archived from the original on September 27, 2019. Retrieved April 3, 2014.
  2. Colette's buko (coconut) pie, Pinoy Cook, April 5, 2005, archived from the original on February 14, 2008, retrieved October 12, 2007
  3. framelia V. Anonas, Freezing technology keeps buko pie fresh, Science and Technology Information Institute, archived from the original on March 10, 2008, retrieved October 12, 2007
  4. The Safe Way to Blast Chill, Freeze and Thaw (PDF), United Kingdom: Foster Refrigerator, archived from the original (PDF) on May 7, 2006, retrieved October 12, 2007
  5. Joven, Ed (August 30, 2024). "How to make Buko Pie". Filipino Recipes Portal.
  6. Back In The Kitchen with a Buko, dessertcomesfirst.com, archived from the original on April 3, 2009, retrieved October 12, 2007
"https://te.wikipedia.org/w/index.php?title=బూఖొ_పై&oldid=4321479" నుండి వెలికితీశారు