బెండపూడి సుబ్బారావు
బెండపూడి సుబ్బారావు పురాతత్వ శాస్త్రవేత్త.
జీవిత విశేషాలు
మార్చుఆయన విశాఖపట్నంలో 1923లో జన్మించారు. లక్నో విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (చరిత్ర) చదివారు. తరువాత ఎల్.ఎల్.బి పట్టాను పొందారు. పూనాలోని దక్కన్ కళాశాలలో ప్రొఫెసర్ వద్ద పురాతత్వ పరిశోధకులుగా విశేష కృషిచేసారు. కేవలం పురాతన శాసన పరిశోదనలూ, పురాతన పత్రాల సేకరణ, హెరిటేజ్ కట్టాడాల గుర్తింపు, భద్రత కల్పించడం మొదలైన వాటితో సరిపెట్టుకోకుండా తవ్వకాల విషయంలో పలు నూతన విధానాలను ప్రవేశపెట్టారు. చరిత్రకు కొత్త ఆధారాలను చూపాలనే తృష్న, దీక్షలతో పరిశోధనారంగంలో అప్రతిహితంగా దుసుకుపోయారు.[1]
పరిశోధనలు
మార్చుఆయన ఆంధ్రప్రదేశ్ లోని బళ్ళారి ప్రాంతంలో తవ్వకాలను నిర్వహించి నవ్య యుగానికి సంబంధించిన అనేక అపురూప విశేషాలకు వెలుగు చూపించారు. ఆయన storage culture of Ballari అనే శీర్షికతో రూపొందించిన నివేదికను వెలువరించి ప్రఖ్యాతులయ్యారు. బళ్ళారి ప్రాంతపు పురా చారిత్రిక సాంస్కృతులు అనే అంశం మీద పి.హెచ్.డి చేసారు. బరోడా విశ్వవిద్యాలయంలో పురాతత్వ విభాగాన్ని నూతనంగా నెలకొల్పిన ఘనత ఈయనకు చెందుతుంది.
రచనలు
మార్చు- Baroda through the ages, being the report of an excavation conducted in the Baroda area, 1951-1952
- The personality of India,: A study in the development of material culture of India and Pakistan (M. S. University.
- The personality of India, a study in the development of material culture of India and Pakistan[2]
మూలాలు
మార్చు- ↑ ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్, విజయవాడ ed.). విజయవాడ: శ్రివాసవ్య. ఆగస్టు 2011. p. 396.
- ↑ Books by Bendapudi Subbarao