బెమెతరా జిల్లా

ఛత్తీస్గఢ్ లోని జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో బెమెతెర జిల్లా ఒకటి. ఈ జిల్లాను ముఖ్యమంత్రి రామన్ సింగ్ 2012 జనవరి 13 న ప్రారంభించారు. జిల్లకు మొదటి కలెక్టరుగా స్రుతి సింఘ్ నియమించబడింది.

బెమెతరా జిల్లా
ఛత్తీస్‌గఢ్ జిల్లా
దేవర్బీజ సీతా ఆలయం
దేవర్బీజ సీతా ఆలయం

విభాగాలు మార్చు

బెమెతెర జిల్లా 2 నిర్వహణా విభాగాలుగా విభజించబడ్డాయి: బెమెతెర, సజ (చత్తిస్‌గఢ్). జిల్లాలో 4 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు (నవగర్, బెమెతెర, సజ, బెర్ల) ఉన్నాయి.

ఆర్ధికం మార్చు

బెమెతెర జిల్లా ఆర్థిక రంగం వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో 80% ప్రజలు వారి పొలాలు, తోటలలో పనిచేస్తుంటారు. మిగిలిన వారిలో 10% ప్రభ్త్వౌద్యోగాలు చేస్తున్నారు. ఇవి వర్సుగా: విద్య, నీటిపారుదల, విద్యుత్తు, ఇతర కార్యాలయాలలో పనిచేస్తుంటారు. వీటిలో విద్యారంగం ఆధిక్యతలో ఉంది. 10% ప్రజలు వ్యాపారం, రియల్ ఎస్టేట్, చిల్లర వ్యాపారం ఉన్నారు. బెమెతెర జిల్లాలో పన్నువసూలు శాఖ శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది పురపాలకానికి 5కోట్ల రూపాయల నిధిని సమకూరుస్తుంది.

సంస్కృతి మార్చు

బెమెతెర సంస్కృతి మీద ఛత్తీస్‌గఢ్ ధర్మాలు, ఆచారాలు, అలవాట్ల ప్రభావం అధికంగా ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఇతర జిల్లాలలో వలె ఈ జిల్లాలో కూడా వివిధ సందర్భాలలో మండలం, మేళా (మాఘ పూర్ణిమ రోజు) నిర్వహించబడుతుంది. భై దుజ్ సందర్భంలో మాతర్ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఇది దీపావళి లక్ష్మీ పూజకు మరుసటి రోజు నిర్వహించబడుతుంది. దీపావళి, హోళీ పండుగలతో హరేలి, తిజ, దేవ్, ఉథాని ఎకాదశి, కార్తిక్ పూర్ణిమ మొదలైన పండుగలు కూడా జరుపుకుంటారు.

ప్రజలు మార్చు

జిల్లాలో ప్రజలు అత్యధికంగా భారతీయ ఆర్యసంప్రదాయానికి చెందినవారు. తరువాత స్థానంలో దక్షిణ ద్రావిడ సంప్రదాయానికి చెందినవారు. బెమెయెర జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కేంద్రస్థానంలో ఉంది. ఇది రాష్ట్రానికి ఇది వాణిజ్య కేంద్రంగా ఉన్నందున జిల్లాలో అత్యధికంగా వైశ్యులు ఉన్నారు. అంతేకాక ఇతర స్థానిక గిరిజనప్రజలు కూడా నివసిస్తున్నారు.

.

మూలాలు మార్చు

https://www.facebook.com/pritendrac

https://www.facebook.com/ZilaBemetara

వెలుపలి లింకులు మార్చు