బెరాక్టెంట్

నవజాత శిశువులలో శ్వాసకోశ బాధ సిండ్రోమ్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం

బెరాక్టెంట్, అనేది సుర్వంత బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది నవజాత శిశువులలో శ్వాసకోశ బాధ సిండ్రోమ్‌ను నివారించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది నెలలు నిండకుండా జన్మించిన వారిలో ఉపయోగించబడుతుంది.[1] ఇది శ్వాసనాళంలో ఇవ్వబడుతుంది.[1] ప్రభావాలు నిమిషాల్లో ప్రారంభమవుతాయి, 3 రోజుల వరకు ఉండవచ్చు.[1]

Clinical data
వాణిజ్య పేర్లు సుర్వంత, అల్వియోఫాక్ట్
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) POM (UK) -only (US)
Routes ఎండోట్రాషియల్
Identifiers
CAS number 108778-82-1 ☒N
ATC code None
DrugBank DB06761
ChemSpider none ☒N
UNII S866O45PIG checkY
KEGG D03096
ChEMBL CHEMBL1201624 ☒N
Chemical data
Formula ?
 ☒N (what is this?)  (verify)

నెమ్మదిగా హృదయ స్పందన రేటు, తక్కువ ఆక్సిజన్, తక్కువ రక్తపోటు, అధిక రక్తపోటు, అప్నియా, ఎండోట్రాషియల్ ట్యూబ్ ప్రతిష్టంభన వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో సెప్సిస్ కూడా ఉండవచ్చు.[1] ఇది ఆవుల నుండి తీసుకోబడిన పల్మనరీ సర్ఫ్యాక్టెంట్.[1]

బెరాక్టెంట్ 1991లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి 100 మి.గ్రా.ల ధర దాదాపు 400 అమెరికన్ డాలర్లు.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Beractant Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 January 2021. Retrieved 10 January 2022.
  2. "Survanta Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2021. Retrieved 10 January 2022.