బెలారస్ భాష (беларуская мова) అనేది బెలారస్ ప్రజల భాష, బెలారస్, విదేశాలలో, ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్, పోలాండ్‌లలో ఉపయోగించబడుతుంది . బెలారస్‌లో సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్యం పొందే ముందు ఈ, భాష (జాతి, దేశ పేర్ల ప్రకారం) " బేలోరియన్ " లేదా " బెలారసియన్ "గా పిలువబడేది.1917 లో రష్యన్ విప్లవం తర్వాత భాషను ప్రామాణీకరించడానికి, క్రోడీకరించడానికి మొదటి ప్రయత్నం జరిగింది . తూర్పు స్లావిక్ భాషలలో ఒకటిగా, బెలారసియన్ సమూహంలోని ఇతర భషలతో అనేక వ్యాకరణ, భాషా శబ్ద లక్షణాలను పంచుకుంటుంది.బెలారసియన్ భాష ఇండో-యూరోపియన్ ఈస్ట్-స్లావిక్ భాష, ఇది ఉక్రేనియన్, పోలిష్, రష్యన్ భాషలతో చాలా భాషా సారూప్యతను కలిగి ఉంది. కొన్ని పరిశోధనల ప్రకారం, 80% మౌఖిక బెలారసియన్ ఉక్రేనియన్‌ను పోలి ఉంటుంది, 80% ఆధునిక లిఖిత భాష రష్యన్‌తో సమానంగా ఉంటుంది, ఇది బెలారస్ దేశం యొక్క రెండు అధికారిక భాషలలో ఒకటి . ఇది స్లావిక్ కుటుంబానికి చెందిన తూర్పు స్లావిక్ శాఖకు చెందిన భాష. 1999 మొదటి బెలారస్ సెన్సస్‌లో, బెలారసియన్ భాషను దాదాపు 3,686,000 మంది బెలారసియన్ పౌరులు (జనాభాలో 36.7%) "ఇంట్లో మాట్లాడే భాష"గా ప్రకటించారు.  దాదాపు 6,984,000 (85.6%) మంది బెలారసియన్లు దీనిని తమ "మాతృభాష"గా ప్రకటించారు.ఇది సుదీర్ఘమైన, సంక్లిష్టమైన చరిత్రను కలిగి ఉంది[1], అయినప్పటికీ, కేవలం 26% మంది మాత్రమే దీనిని రోజువారీ జీవితంలో ఉపయోగిస్తున్నారు[2], ప్రామాణికమైన బెలారసియన్ వ్యాకరణం దాని ఆధునిక రూపంలో 1985, 2008లో చిన్న సవరణలతో 1959లో ఆమోదించబడింది.

వర్ణమాల మార్చు

బెలారసియన్ వర్ణమాల అనేది సిరిలిక్ స్క్రిప్ట్ యొక్క రూపాంతరం, ఇది మొదట పాత చర్చి స్లావోనిక్ భాషకు వర్ణమాలగా ఉపయోగించబడింది. ఆధునిక బెలారసియన్ రూపం 1918లో నిర్వచించబడింది, ముప్పై రెండు అక్షరాలను కలిగి ఉంటుంది. దీనికి ముందు, బెలారసియన్ లాటిన్ వర్ణమాల (Łacinka / Лацинка), బెలారసియన్ అరబిక్ వర్ణమాల ( లిప్కా టాటర్స్ ద్వారా ), హీబ్రూ వర్ణమాల ( బెలారసియన్ యూదులచే ) కూడా వ్రాయబడింది. దీనికి గ్లాగోలిటిక్ లిపి 11వ లేదా 12వ శతాబ్దం వరకు అప్పుడప్పుడు ఉపయోగించబడింది.బెలారసియన్ లాటిన్ వర్ణమాల చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది.

మూలాలు మార్చు

  1. "Belarusian Language - Structure, Writing & Alphabet - MustGo". MustGo.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-20.
  2. "Belarusian language: facts and figures". belsat.eu (in ఇంగ్లీష్). Retrieved 2022-02-20.