బెళ్లందూరు చెరువు
బెళ్లందూరు చెరువు, బెంగుళూరు నగరంలో కల ముఖ్య చెరువులలో ఒకటి.[1][2] ప్రస్తుతం కాలుష్యపు కోరలలో చిక్కి విలవిలలాడుతుంది..
బెళ్లందూరు చెరువు | |
---|---|
ప్రదేశం | Southeast of బెంగుళూరు నగరం |
అక్షాంశ,రేఖాంశాలు | 12°56′06″N 77°40′05″E / 12.935094°N 77.668147°E |
వెలుపలికి ప్రవాహం | వర్తూరు చెరువు |
పరీవాహక విస్తీర్ణం | 148 km² |
గరిష్ట పొడవు | 3.6 km |
గరిష్ట వెడల్పు | 1.4 km |
ఉపరితల వైశాల్యం | 3.61 km² |
ఉపరితల ఎత్తు | 921 m |
ఘనీభవనం | Never |
ప్రాంతాలు | బెంగుళూరు |
నేపథ్యం
మార్చుఒకప్పుడు దక్షిణ బెంగళూరుకు సాగు, తాగునీరు అందించిన బెళ్లందూరు చెరువు ప్రస్తుతం పూర్తిగా కాలుష్యమయంగా మారింది. నీరు ఉపయోగించలేని స్థితి ఎదురవుతోంది. శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే బెంగళూరు అభివృద్ధి ప్రాధికార రూపొందించిన పథకం నేటికి కార్యరూపం దాల్చలేదు. చుట్టు పక్కల పరిశ్రమలు వదిలే రసాయనికాలతో కూడిన నీరు చెరువు రూపాన్ని నల్లగా మార్చేసింది. తెల్లటి నురగతో కూడిన నీరు ప్రవహిస్తోంది. చెరువు చుట్టు పక్కల ఎత్తైన భవనాలు తలెత్తాయి. ఆ భవనాల్లో నుంచి మురుగు ఇటే తరలివస్తోంది. రెండు వందల ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు పూర్తిగా గుర్రపు డెక్కలతో నిండి ఉంది. తొలగింపు కార్యక్రమాన్ని అప్పుడప్పుడు చేపట్టినా మళ్లీమళ్లీ వృద్ధి చెందుతున్నాయి. నిత్యం పారే అలుగు వద్ద తెల్లటి నురగ కొద్ది నిమిషాలకు నల్లగా మారుతుంది. చుట్టు పక్కల భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి. తాగేందుకు వినియోగించడం లేదు. చెరువు కింద పండే కూరగాయలు విషపూరితమైనట్లు పరిసరవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీటితో పండే కూరగాయలు, ఆకు కూరలు వినియోగిస్తే నగదు ఇచ్చి వ్యాధుల్ని కొనుగోలు చేసినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఎస్.ఎం.కృష్ణ కాలంలో చెరువు సమగ్రాభివృద్ధికి బీడీఏ రూ.150కోట్లు వ్యయంతో పథకాన్ని సిద్ధం చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పథకాన్ని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.
మూలాలు
మార్చు- ↑ http://www.rainwaterharvesting.org/bellandur/bellandur.htm
- ↑ "Bellandur Lake | Lakes in Bangalore | Bangalore". Karnataka.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-21. Retrieved 2020-02-28.