బెహెనిక్ ఆమ్లం (Behenic acid ; also docosanoic acid) ఒక రకమైన సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : C21H43COOH.

బెహెనిక్ ఆమ్లం
పేర్లు
IUPAC నామము
Docosanoic acid
ఇతర పేర్లు
Behenic acid, Docosanoic acid; 1-Docosanoic acid; n-Docosanoic acid, n-Docosanoate, Glycon B-70, Hydrofol Acid 560, Hydrofol 2022-55, Hystrene 5522, Hystrene 9022, Prifrac 2989, C22:0 (Lipid numbers)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [112-85-6]
పబ్ కెమ్ 8215
యూరోపియన్ కమిషన్ సంఖ్య 204-010-8
కెగ్ C08281
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:28941
SMILES O=C(O)CCCCCCCCCCCCCCCCCCCCC
  • InChI=1/C22H44O2/c1-2-3-4-5-6-7-8-9-10-11-12-13-14-15-16-17-18-19-20-21-22(23)24/h2-21H2,1H3,(H,23,24)

ధర్మములు
C22H44O2
మోలార్ ద్రవ్యరాశి 340.59 g·mol−1
స్వరూపం White to yellowish crystals or powder
ద్రవీభవన స్థానం 80.0 °C[1]
బాష్పీభవన స్థానం 306 °C
ప్రమాదాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references
బెహెనిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే బెన్ నూనె లభించే మునగ చెట్టు, Moringa oleifera

బెహెనిక్ ఆమ్లం 22 కార్బనులుండి పొడవైన హైడ్రొకార్బను గొలుసును కలిగివున్న సంతృప్త కొవ్వుఆమ్లం. సరళమైన, శాఖలులేని శృంఖలంనుకలివున్న కొవ్వు ఆమ్లం. బెహెనిక్‌ ఆమ్లం శాకనూనెలలో తక్కువప్రమాణంలో వున్నఆమ్లం. శాస్త్రీయ నామం: n-డొకసనొయిక్‌ ఆమ్లం. ఫార్ములా C21H43COOH. తెల్లగా లేదా క్రీమ్‌రంగులో స్పటికరూపంలో వుండును. మొరింగేసి కుటుంబానికి చెందిన బెన్ లేదా బెహెన్ (Moringo oleifera) అనగా మునగ విత్తననూనెలో మొదటగా గుర్తించారు. అందుచే ఈఅమ్లానికి బెహెనిక్‌ అనేపేరు రూడి అయ్యింది. బెన్ విత్తననూనెలో కాకుండగా వేరుశెనగ నూనె, ఆవాల నూనె (mastard or canola) లో అతికొద్దిశాతంలో కన్పించును. ఈనూనెలలో 1-2% వరకు మాత్రమే ఉంది. వేరుశనగ విత్తనం పైపోరలో బెహెనిక్‌ ఆమ్లం ఎక్కువగా నిక్షిప్తమై వున్నది.. బెహెనిక్ ఆమ్లం యాంటిఅక్క్షిడెంట్‌ గుణాలను కలిగివున్నది. అయితే బెహనిక్‌ ఆమ్లానికి కొలెస్ట్రాల్‌ను పెంచుగుణం కూడా ఉంది. బెహెనిక్‌ ఆమ్లం జీర్ణవ్యవస్దలో అంతత్వరగా శోషింపబడదు. బెహెనిక్‌ అమ్లాన్ని క్షయికరించిన (reduction) బెహెనిక్‌ అల్కహాల్‌ ఎర్పడును.

అణుసౌష్టవ ఫార్ములా:C22H44O2 లేదా CH3 (CH2) 20COOH

బెహెనిక్‌ఆమ్లం దర్మాల పట్టిక

లక్షణము విలువల మితి
స్వరూపం ఘనస్పటికం, తెలుపు
ఆణుభారం 340.58
ద్రవీభవన ఉష్ణోగ్రత 79.950C
మరుగు ఉష్ణోగ్రత 3060C
వక్రీభవన సూచిక nD40 1.4270
సపొనిఫికెసన్‌ విలువ 163-169 (mgKOH/Gram)
కలరు (టింటొమిటరు) 7.0Y+1.0R
ద్రావణీయత క్లొరొఫారం, యిథైలీథరులలో కరుగును.

ఉపయోగాలు

మార్చు
  • కందెననూనెల తయారిలో
  • కాస్మొటిక్‌, హైర్‌ కండిసనరుల తయారిలో
  • షాంపో, డియోడరెంట్స్,
  • ఐలైనరు (eye liner), ఫెసియల్‌ మాయిస్చరైజరు తయారిలో
  • డెటెర్జెంట్స్, ఇన్‌ఫ్లోర్ పాలిషర్స్, డ్రిప్‌లెస్ క్యాండల్‌ల తయారిలో వాడెదరు.

మూలాలు

మార్చు
  1. "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 73 (4): 685–744. 2001. doi:10.1351/pac200173040685.