బేబీ రాణి మౌర్య భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్‌. ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పని చేస్తుంది. బేబీ రాణి మౌర్య 1996లో సమాజ్ రత్న, 1997లో ఉత్తర ప్రదేశ్ రత్న, 1998లో నారి రత్న అవార్డులు అందుకుంది.

బేబీ రాణి మౌర్య
ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్‌
In office
26 ఆగష్టు 2018 – 15 సెప్టెంబర్ 2021[1]
త్రివేంద్ర సింగ్ రావత్
తీరత్ సింగ్ రావత్
పుష్కర్ సింగ్ ధామి
అంతకు ముందు వారుకృష్ణకాంత్‌ పాల్‌
తరువాత వారులెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్ సింగ్ (రిటైర్డ్‌)
జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు
In office
2002–2005
ఆగ్రా మేయర్
In office
1995–2000
వ్యక్తిగత వివరాలు
జననం (1956-08-15) 1956 ఆగస్టు 15 (వయసు 68)[2]
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిప్రదీప్ కుమార్ మౌర్య

జననం, విద్యాభాస్యం

మార్చు

బేబీ రాణి మౌర్య 15 1956 ఆగస్టు లో ఉత్తరప్రదేశ్ లో జన్మించింది. ఆమె ఎం.ఏ, బి.ఈ.డి పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

మార్చు

బేబీ రాణి 1990లో బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి 1995 నుండి 2000 వరకు మేయర్‌గా, 1997లో బీజేపీ కేంద్ర ఎస్.సి సెల్ విభాగం లో సభ్యురాలిగా పని చేసింది. మౌర్య 2001లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలుగా, 2002లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా పని చేసింది. ఆమె 2007 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఎత్మాద్‌పూర్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయింది.ఆమె 2013 నుండి 2015 వరకు యూపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో వివిధ హోదాల్లో పని చేసింది.[3]

బేబీ రాణి మౌర్య 2018 ఆగష్టు 22న ఉత్తరాఖండ్ గవర్నర్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించాడు. ఆమె 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టింది.ఆమె 2021 సెప్టెంబరు 08న గవర్నర్‌ పదవికి రాజీనామా చేసింది.[4][5][6] ఆమె 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆగ్రా గ్రామీణ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[7]

మూలాలు

మార్చు
  1. https://timesofindia.indiatimes.com/city/dehradun/new-uttarakhand-governor-likely-to-take-oath-on-september-15/articleshow/86100317.cms
  2. "Bioprofile of Smt. Baby Rani Maurya, Hon'ble Governor, Uttarakhand". Rajbhawan Uttarakhand. Archived from the original on 27 August 2018.
  3. The Times of India (22 August 2018). "'Uttarakhand governor Baby Rani Maurya a dedicated worker, strict administrator' | Agra News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  4. V6 Velugu (8 September 2021). "ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబీ రాణి మౌర్య రాజీనామా" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. ETV Bharat News (8 September 2021). "ఆ రాష్ట్ర గవర్నర్‌ రాజీనామా- రాజకీయాల్లోకి రీఎంట్రీ!". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  6. Sakshi (8 September 2021). "ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ రాజీనామా". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  7. Zee News (10 March 2022). "Agra Rural Assembly Election results 2022 (Agra Rural Vidhan Sabha Natija 2022): BJP's Baby Rani Maurya marks landslide victory with 1,37,310 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.