బైబిల్‌లో స్త్రీ పాత్రలు

బైబిలు క్రైస్తవులు, యూదుల పవిత్ర గ్రంథం. ఇది పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం అని రెండు భాగాలుగా ఉన్నాయి. పాత నిబంధన గ్రంథము 39 పుస్తకాల, కొత్త నిబంధన 27 పుస్తకాల సమాహారము. ఈ బైబిలు గ్రంథములో 111 నుండి 137[1] వరకు పేర్లు ఉన్న స్త్రీలు, మరో 600[2] వరకు పేర్లు లేని స్త్రీల ప్రస్తావన ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి.

అవ్వ (ఈవ్)

స్త్రీ పాత్రల జాబితాసవరించు

బైబిలు గ్రంథములో ప్రస్తావించబడిన కొందరు స్త్రీల వివరాలు:

 1. అవ్వ (Eve) : ఆదాము (Adam) భార్య. ప్రథమ స్త్రీ. ఆదికాండములో ఈమె ప్రస్తావన ఉంది.
 2. అనా (Anah) : సిబ్యోను (Zibeon) కుమార్తె. (ఆది కాండము)
 3. అహోలీబామా : అనా (Anah) కుమార్తె. ఏశావు (Esau) భార్య. (ఆది కాండము)
 4. ఆక్సా (Achsah) : కాలేబు (Caleb) కుమార్తె, ఒత్నీయేలు (Othniel) భార్య. (యెహోషువ)
 5. ఆదా I (Adah I) : లెమెకు (Lamech) మొదటి భార్య. (ఆది కాండము)
 6. ఆదా II (Adah II) : ఏలోను (Elon) కుమార్తె, ఏశావు (Esau) భార్య. (ఆది కాండము)
 7. ఆసెనతు (Asenath) : పోతీఫెర (Potipherah) కుమార్తె. జప్నత్ప నేహు (Zaphnathpaaneah) భార్య. (ఆది కాండము)
 8. ఎలీషెబ (Elisheba) : అమ్మీనాదాబు (Amminadab) కుమార్తె. అహరోను (Aaron) భార్య. నాదాబు (Nadab ), అబీహు (Abihu), ఎలియాజరు (Eleazar), ఈతామారు (Ithamar) ల తల్లి. (నిర్గమ కాండము)
 9. ఓర్పా (Orpah) : కిల్యోను(kilion) భార్య. (రూతు)
 10. కెతూరా (Keturah) : అబ్రహాము రెండవ భార్య. జిమ్రాను (Zimran), యొక్షాను (Jokshan), మెదాను (Medan), మిద్యాను (Midian), ఇష్బాకు (Ishbak), షూవహు (Shuah) ల తల్లి. (ఆది కాండము)
 11. కొజ్బీ (Cozbi) : మిద్యానీయుల అధిపతి అయిన సూరు (Zur) కుమార్తె. (సంఖ్యాకాండము)
 12. జిల్పా (Zilpah) : లేయా (Leah) దాసి. యాకోబు (Jacob) ద్వారా గాదు (Gad), ఆషేరు (Asher) లను కన్నది. (ఆది కాండము)
 13. తామారు (Tamar) : ఏరు (Er) భార్య. (ఆది కాండము)
 14. తిమ్నా (Timna) : ఎలీఫజు (Eliphaz) ఉపపత్ని. అతనికి అమాలేకు (Amalek) ను కనింది. (ఆది కాండము)
 15. తిర్సా (Tirzah) : సెలోపెహాదు (Zelophehad) కుమార్తె. (సంఖ్యాకాండము)
 16. దీన (Dinah) : లేయా (Leah), యాకోబు (Jacob) ల ఏడవ సంతానము. (ఆది కాండము)
 17. నయమా (Naamah) : సిల్లా కుమార్తె, తూబల్కయీను (Tubalcain) సహోదరి. (ఆది కాండము)
 18. నయోమి (Naomi) : ఎలీమెలెకు (Elimelech ) భార్య. (రూతు)
 19. నోయా (Noah) : సెలోపెహాదు (Zelophehad) కుమార్తె. (సంఖ్యాకాండము)
 20. పూయా (Puah) : హెబ్రీయుల మంత్రసాని. (నిర్గమ కాండము)
 21. బాశెమతు (Basemath) : ఏలోను (Elon) కుమార్తె, ఏశావు (Esau) భార్య. (ఆది కాండము)
 22. బిల్హా (Bilhah) : రాహేలు (Rachel) దాసి. యాకోబు (Jacob) ద్వారా దాను (Dan), నఫ్తాలి (Naphtali) లను కన్నది. (ఆది కాండము)
 23. మత్రేదు (Matred) : మేజాహాబు (Mezahab) కుమార్తె. (ఆది కాండము)
 24. మహలతు (Mahalath) : ఇష్మాయేలు (Ishmael) కుమార్తె, నెబాయోతు (Nebajoth) సహోదరి, ఏశావు (Esau) భార్య. (ఆది కాండము)
 25. మహలా (Mahlah) : సెలోపెహాదు (Zelophehad) కుమార్తె. (సంఖ్యాకాండము)
 26. మహేతబేలు (Mehetabel) : హదరు (Hadar) భార్య, మత్రేదు (Matred) కుమార్తె. (ఆది కాండము)
 27. మిర్యాము (Miriam) : అహరోను (Aaron) సహోదరి. ప్రవక్త. (నిర్గమ కాండము)
 28. మిల్కా I (Milcah I) : నాహోరు (Nahor) భార్య, హారాను (Haran) కుమార్తె. (ఆది కాండము)
 29. మిల్కా II (Milcah II) : సెలోపెహాదు (Zelophehad) కుమార్తె. (సంఖ్యాకాండము)
 30. యహూదీతు (Judith) : బేయేరీ (Beeri) కుమార్తె, ఏశావు (Esau) భార్య. (ఆది కాండము)
 31. యోకెబెదు (Jochebed) : అమ్రాము (Amram) భార్య. అహరోను (Aaron), మోషే (Moses) ల తల్లి. (నిర్గమ కాండము)
 32. రయూమా (Reumah) : నాహోరు ఉపపత్ని. తెబహు (Tebah), గహము (Gaham), తహషు (Thahash), మయకా (Maachah) ల తల్లి. (ఆది కాండము)
 33. రాహాబ్ (Rahab) : ఒక వేశ్య (యెహోషువా)
 34. రాహేలు (Rachel) : లాబాను (Laban) రెండవ కుమార్తె. యాకోబు (Jacob) భార్య. యోసేపు (Joseph) తల్లి. (ఆది కాండము)
 35. రిబ్కా (Rebekah) : బెతూయేలు (Bethuel) కుమార్తె. ఇస్సాకు ( Isaac) భార్య. (ఆది కాండము)
 36. రూతు (Ruth) : మహ్లోను (Mahlon) భార్య. (రూతు).
 37. లేయా (Leah)  : లాబాను (Laban) మొదటి కుమార్తె. యాకోబు (Jacob) భార్య. రూబేను (Reuben), షిమ్యోను (Simeon), లేవి (Levi ), యూదా (Judah), ఇశ్శాఖారు (Issachar), జెబూలూను (Zebulun) అనే ఆరుగురు కుమారులను దీన (Dinah) అనే కుమార్తెను కన్నది. (ఆది కాండము)
 38. శారయి (Sarai) /శారా (Sarah) : అబ్రాము (Abram) /అబ్రహాము (Abraham) భార్య. (ఆది కాండము)
 39. శెరహు (Serah) : ఆషేరు (Asher) కుమార్తె. (ఆది కాండము)
 40. షిఫ్రా (Shiphrah) : హెబ్రీయుల మంత్రసాని. (నిర్గమ కాండము)
 41. షూయ (Shua) : ఏరు (Er), ఓనాను ( Onan), షేలా ( Shelah ) ల తల్లి. (ఆది కాండము)
 42. సిప్పోరా (Zipporah) : రగూయేలు కుమార్తె. మోషే (Moses) ద్వారా గెర్షోము (Gershom), ఎలీయెజెరు (Eliezer) లను కన్నది. (నిర్గమ కాండము)
 43. సిల్లా (Zillah) : లెమెకు రెండవ భార్య. (ఆది కాండము)
 44. హాగరు (Hagar) : శారయి దాసి. ఈజిప్షియన్. అబ్రాము వలన ఇష్మాయేలు (Ishmael) ను కన్నది. (ఆది కాండము)
 45. హొగ్లా (Hoglah) : సెలోపెహాదు (Zelophehad) కు
 46. మార్తె. (సంఖ్యాకాండము)

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. Karla Bombach (2000). Craven, Toni; Kraemer, Ross; Myers, Carol L. (eds.). Women in Scripture: A Dictionary of Named and Unnamed Women in the Hebrew Bible, the Apocryphal/Deuterocanonical Books and New Testament. Houghton Mifflin. p. 34. ISBN 978-0395709368. Retrieved 14 April 2017.
 2. Craven, Toni; Kraemer, Ross; Myers, Carol L., eds. (2000). Women in Scripture: A Dictionary of Named and Unnamed Women in the Hebrew Bible, the Apocryphal/Deuterocanonical Books and New Testament. Houghton Mifflin. p. xii. ISBN 978-0395709368. Retrieved 14 April 2017.