బొన్ని గాబ్రియేల్

బొన్ని గాబ్రియేల్ (జననం మార్చి 20, 1994) అమెరికాకు చెందిన అందాల పోటీ టైటిల్‌ విజేత. ఆమె 2023లో అమెరికాలోని లూసియానా రాష్ట్రం, న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన 71వ ఎడిషన్‌ మిస్ యూనివర్స్ 2022 విజేతగా నిలిచింది.[1]

ఆర్' బొన్ని గాబ్రియేల్
అందాల పోటీల విజేత
జననముఆర్' బొన్ని నోలా గాబ్రియేల్
(1994-03-20) 1994 మార్చి 20 (వయసు 30)
హౌస్టన్, టెక్సాస్, యూ.ఎస్.ఎ
విద్యయూనివర్సిటీ అఫ్ నార్త్ టెక్సాస్ (బిఎఫ్ఏ)
వృత్తి
 • బ్యూటీ పజంట్ టైటిల్ హోల్డర్
 • ఫాషన్ డిజైనర్
 • మోడల్
ఎత్తు170 cm
జుత్తు రంగుబ్రౌన్
కళ్ళ రంగుహాజెల్
బిరుదు (లు)
 • మిస్ టెక్సాస్ యూ.ఎస్.ఎ 2022
 • మిస్ యూనివర్స్ 2022
ప్రధానమైన
పోటీ (లు)
 • మిస్ టెక్సాస్ యూ.ఎస్.ఎ 2021 (మొదటి రన్నరప్‌)
 • మిస్ యూ.ఎస్.ఎ 2022 (విజేత)

అమెరికాకు చెందిన ఆర్. బోని గాబ్రియేల్ 'విశ్వ సుందరి ( మిస్ యూనివర్స్ ) - 2022 ' కిరీటాన్ని అందుకుంది.[2] అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లిన్స్ లో 2023 జనవరి 14వ తేదీన మిస్ యూనివర్స్ - 2022 గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. 71 విశ్వసుందరి పోటీలో 90 దేశాలకు చెందిన పోటీ దారులను వెనక్కి నెట్టి బోని గాబ్రియేల్ విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది.[3] మాజీ విశ్వసుందరి హర్నాజ్ సందు చేతుల మీదుగా బోని గాబ్రియేల్ విశ్వ సుందరి - 2022 కిరీటాన్ని స్వీకరించింది. భరత్ తరపున కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివిత రాయ్ ఏడాది విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్నది.

మిస్ యూనివర్స్ 2022 మార్చు

బొన్ని గాబ్రియేల్ మిస్ USA 2022గా, ఆమె మిస్ యూనివర్స్ 2022 పోటీలో యునైటెడ్ స్టేట్స్ తరపున ప్రాతినిధ్యం వహించి మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని గెలుచుకుంది.[4] ఆమె మిస్ యూనివర్స్ గెలుచుకున్న 9వ అమెరికన్‌గా నిలిచింది. ఆమె విజయం మిస్ యూనివర్స్ 2012లో ఒలివియా కల్పో తర్వాత మిస్ యూనివర్స్ గెలుచుకున్న యునైటెడ్ స్టేట్స్ నుండి మొదటి ప్రతినిధిగా నిలిచింది.[5]

మూలాలు మార్చు

 1. Namasthe Telangana (15 January 2023). "విశ్వసుందరిగా అమెరికా అందగత్తె.. కిరీటం దక్కించుకున్న బొన్ని గాబ్రియేల్". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
 2. "R'Bonney Gabriel", Wikipedia (in ఇంగ్లీష్), 2023-03-09, retrieved 2023-03-15
 3. "Who is R'Bonney Gabriel, the first Filipino-American to be crowned Miss Universe 2022?". The Indian Express (in ఇంగ్లీష్). 2023-01-15. Retrieved 2023-03-15.
 4. V6 Velugu (15 January 2023). "మిస్ యూనివర్స్ 2022గా బొన్ని గాబ్రియేల్". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 5. TV9 Telugu (15 January 2023). "దివి నుంచి దిగివచ్చావా?విశ్వసుందరి గాబ్రియెల్‌ బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)