బొమ్మల కథలు
బొమ్మలు కథలు (కామిక్స్) కథల లాంటి ఏదైనా భావనలను, బొమ్మలు, పాఠ్యం మొదలైన దృశ్యరూపాల సాయంతో వ్యక్తం చేసే సాధనం. బొమ్మలకు శీర్షికలు, మాటల బుడగలు (స్పీచ్ బలూన్స్) సంభాషణలు, నేపథ్య కథనం, ధ్వనిని సూచించడానికి వాడతారు.
కామిక్స్ చరిత్ర వివిధ సంస్కృతులలో విభిన్న మార్గాలను అనుసరించింది. పండితులు బొమ్మల కథల పూర్వ చరిత్ర లాస్కాక్స్ గుహ చిత్రాల నుంచి ఉందని ప్రతిపాదించారు. 20వ శతాబ్దం మధ్య నాటికి కామిక్స్ యునైటెడ్ స్టేట్స్, పశ్చిమ ఐరోపా (ముఖ్యంగా ఫ్రాన్స్ మరియు బెల్జియం) ఇంకా జపాన్లో అభివృద్ధి చెందాయి. యూరోపియన్ కామిక్స్ చరిత్ర 1830ల నాటి రుడాల్ఫ్ టాఫర్ వేసిన కార్టూన్ స్ట్రిప్స్‌తో ముడిపడిఉంది. అయితే 1865 నుండి విల్హెల్మ్ బుష్, అతని మాక్స్ అండ్ మోరిట్జ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపారు.[1][2][3][4] ప్రజాదరణ పొందారు. ది అడ్వెంచర్స్ ఆఫ్ టిన్టిన్ వంటి స్ట్రిప్స్ మరియు పుస్తకాల 1930లలో విజయం సాధించాయి.