బొల్లోజు బసవలింగం యానాంకు చెందిన కవి, రచయిత, జాతీయ వాది. పుదుచ్చేరి ప్రభుత్వము చేత "తెలుగురత్న" బిరుదాంకితులు. ఆయన సువర్ణశ్రీ అనే కలంపేరుతో అనేక రచనలు చేసాడు. యానాం విలీనోద్యమ సమయంలో ఆయన ఫ్రెంఛ్ ఇండియన్ యువజన కాంగ్రెస్ యానాం శాఖకు అధ్యక్షునిగా పనిచేసాడు. దడాల సూచన మేరకు యానాంలోనే ఉంటూ తన మిత్రబృందంతో కలసి యానాం ప్రజలలో ఉద్యమభావాలు కలిగించాడు. ఉద్యమ వ్యతిరేకవాదుల దాడులకు గురయ్యాడు. ఇతను సువర్ణశ్రీ బిరుదాంకితుడు.వీరు 25 ఏప్రిల్ 2004 న తుదిశ్వాస విడిచారు.

జీవిత విశేషాలుసవరించు

అతను 1934 జూలై 10న పాండిచ్ఛేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో జన్మించాడు[1]. అతను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1973లో రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ. చేసాడు. 1980లో కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి ఫ్రెంచ్ భాషపై ఎం.ఎ చేసాడు. 1990లో మైసూరు విశ్వవిద్యాలయం నుండి బి.ఇ.డి చేసాడు. తరువాత 1985లో ఫ్రెంచ్ భాషా బోధనపై డిప్లొమా చేసాడు.అతను ప్రత్యేకించి ప్రెంచ్ ఇండియా యుద్ద సమయంలో ఫ్రెంచ్ భాషలో ప్రొఫెసరుగా పనిచేసాడు. యానాం లోని కోర్స్ డి ఫ్రాంచైజ్ డి యానాంకు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసాడు. అతను నాటకరంగంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు సాహితీ పురస్కారాన్ని పొందాడు.[2]

రచనలుసవరించు

  • ఎవరు దోషి? (1968 నాటకం)
  • వారసుడు (1968 హాస్యరచన)
  • హిస్టరీ ఆఫ్ యానాం - 1981 (ఆంగ్ల రచన)

మూలాలుసవరించు

  1. S.babu Rao. Whos Who Of Indian Writers.
  2. Dutt, Kartik Chandra (1999). Who's who of Indian Writers, 1999: A-M (in ఆంగ్లం). Sahitya Akademi. ISBN 978-81-260-0873-5.