బోపదేవ వ్యాకరణము

పాణిని రచించిన గ్రంథము అష్టాధ్యాయి. శబ్ద శాస్త్రమును సూత్ర రూపమున బోధించి కృతకృత్యుడయిన వారిలో ఈతడే ఉత్తమోత్తముడు. వ్రాసినవి నాలుగువేల సూత్రములు. వానికి అనుకూల పడుటకు, అధికారము లనియు అనువృత్తు లనియు మరికొన్నిటిని స్వీకరించెను. అష్టాధ్యాయి పిదప వైయూకరణులు అనేకులు పాణినీయ తంత్రమునకు వ్యాఖ్యానములు కావించిరి. అష్టాధ్యాయిలో ఉన్నవి ఉన్నట్టు సూత్రములనుంచి ఆక్రముమమున వ్యాఖ్యానములోనర్చినవారు కొందరు. విషయమంతకు ఒకవిధముగ ప్రణాళిక ఏర్పరచుకొని తదనుకూలముగ శీర్షికలను గావించి చక్కగా బోధించువారు కొందరు. ఇటువంటి వ్యాకరణములలో ఒకటి ఈ బోపదేవ వ్యాకరణము. ఈ బోపదేవుడు మహారాష్ట్రుడు. ఇతని వాక్యములను మల్లినాథుడు పేర్కొనియున్నాడు. ఇది కాతంత్ర వ్యాకరణము వలే విషయ క్రమమును బట్టి యుండును. స్వరాదులు చెప్పు సూత్రములేవీ ఇందు కనబడలేదు. ఇందు హరిహరులయు, ఇతర దేవతలయు పేరులు లక్ష్యములుగా ఈయబడుచుండును. ఇదే పద్ధతిని తరువాతివారు కొందరు సంజ్ఞలకు కూడా కృష్ణ-రాధ మున్నగు పేరులు పెట్టిరి. మహారాష్ట్ర దేశీయుల ప్రాబల్యములో మాత్రము దీనికి అధిక ప్రచారమున్నట్లు తెలియుచున్నది. శాబ్దకౌస్తుభములో బోపదేవుని పేరు భట్టోజీ దీక్షితుడు చెప్పియుండుటచే దీనికి ప్రచారము పెరిగింది. కాలక్రమమున అన్నింటితో పాటు ఇదియు అడుగంటినది.

మూలాలు

మార్చు

1. భారతి మాస సంచిక.