బోర్నియో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ద్వీపము. ఇది ఆసియాలో అతిపెద్ద ద్వీపం. ఇది ఆగ్నేయాసియా సముద్రప్రదేశానికి కేంద్రంగా ఉంది. ఈ ద్వీపము జావా ద్వీపానికి ఉత్తరంగా, సులవెసికి పశ్చిమంగా, సుమాత్రాకు తూర్పుగా ఉంది. ఈ ద్వీపం రాజకీయ పరంగా మూడు దేశాల మధ్య పంచబడి ఉంది. అవి ఉత్తరంగా మలేషియా, బ్రూనై, దక్షిణాన ఇండోనేషియా. దాదాపు మూడొంతుల భూభాగం ఇండోనేషియా అధీనంలో ఉంది. మరో 26% తూర్పు మలేషియా రాష్ట్రాలైన సబహ్, సరావక్ గా ఉన్నాయి. 1% భూభాగం మలేషియా దేశపు స్వతంత్ర ప్రతిపత్తి కల రాష్ట్రం లాబువాన్ గా ఒక చిన్న ద్వీపంగా బోర్నియో తీరంలో ఉంది. ఉత్తర తీరంలో ఉన్న బ్రూనై దేశం బోర్నియో భూభాగంలో 1% గా ఉంది. భూగోళంలో అమెజాన్ అడవులకు సరిగ్గా ఇటువైపు కొనలో ఉండే బోర్నియో ద్వీపంలో ప్రపంచంలోని అత్యంత పురాతన వాన అడవులు ఉన్నాయి.

బోర్నియో
పలావు బోర్నియో
కాలిమంతాన్
Borneo Topography.png
బోర్నియో ద్వీప భూభాగ భౌగోళిక స్థితి
Geography
Locationఆగ్నేయ ఆసియా
Coordinates01°N 114°E / 1°N 114°E / 1; 114Coordinates: 01°N 114°E / 1°N 114°E / 1; 114
Archipelagoమహా సుండా ద్వీపాలు
Area743,330 kమీ2 (287,000 sq mi)
Area rank3rd
Highest elevation4,095
Highest pointకినాబలు పర్వతం
Country
బ్రూనై
జిల్లాలుబెలైట్ జిల్లా
బ్రూనై-మ్‌వారా జిల్లా
టెంబురాంగ్ జిల్లా
ట్యుటాంగ్ జిల్లా
Largest cityబందర్ సేరి బెగవన్ (జనాభా. ~50,000)
ఇండోనేషియా
విభాగాలుపశ్చిమ కాలిమంతాన్
మధ్య కాలిమంతాన్
దక్షిణ కాలిమంతాన్
తూర్పు కాలిమంతాన్
ఉత్తర కాలిమంతాన్
Largest cityసమరింద (జనాభా. 842,691)
మలేషియా
స్వతయం ప్రతిపత్తి రాష్ట్రాలు, రాష్ట్రాలుసబాహ్
సరావక్
లాబువాన్
Largest cityకుచింగ్ (జనాభా. 617,886)
Demographics
Population21,258,000 (as of 2014)
Density21.52
"https://te.wikipedia.org/w/index.php?title=బోర్నియో&oldid=2882694" నుండి వెలికితీశారు