బోస్టన్ టీ పార్టీ

బోస్టన్ టీ పార్టీ అనేది అమెరికా దేశంలో అప్పుడు పరిపాలిస్తున్న బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాలలో ఇది ప్రముఖమైనది. ఈ ఉద్యమాన్ని సన్స్ ఆఫ్ లిబర్టీ అనే సంస్థకు చెందిన ఉద్యమకారులు నేటివ్ అమెరికన్ల వేషధారణలో వచ్చి ఈస్టు ఇండియా కంపెనీకి చెందిన "టీపొడి"ని రవాణా చేసే పడవలోని టీపొడి సరుకును మొత్తం నీటిపాలు చేసారు. ఈ సంఘటన డిసంబరు 16,1773లో బోస్టన్ ఓడరేవు వద్ద జరిగింది. అందుకే ఈ సంఘటనకు ఈ పేరు వచ్చింది. 

Two ships in a harbor, one in the distance. On board, men stripped to the waist and wearing feathers in their hair throw crates of tea overboard. A large crowd, mostly men, stands on the dock, waving hats and cheering. A few people wave their hats from windows in a nearby building.
This iconic 1846 lithograph by Nathaniel Currier was entitled "The Destruction of Tea at Boston Harbor"; the phrase "Boston Tea Party" had not yet become standard. Contrary to Currier's depiction, few of the men dumping the tea were actually disguised as Native Americans.[1]

ఈ సంఘటన బ్రిటీషర్ల టీ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమములో సంభవించింది. అమెరికన్ల తరపున బ్రిటీష్ ప్రభుత్వంలో మాట్లాడటానికి ఒక్కరు కూడా లేరు. కానీ బ్రిటన్ ప్రభుత్వం అమెరికన్ల చేత పన్నులు కట్టించుకుంటూ వారిని ప్రభుత్వంలో భాగం చేయలేకపోయిందని  అమెరికన్ల ఆగ్రహం. తమ తరుపున మాట్లాడటానికి ప్రతినిధి లేనందున తాము బ్రిటన్ ప్రభుత్వానికి పన్నులు కట్టకూడదని వారు నిశ్చయించుకున్నారు. ("No taxation without representation!") అమెరికాకు చెందిన వ్యాపారులు బ్రిటన్ ప్రభుత్వానికి అధికంగా పన్నులు చెల్లించుట వలన సరుకులు అమ్మి ఎక్కువ లాభాన్ని పొందలేక పోయేవారు. చివరికి అమెరికన్లు అక్రమ రవాణా ద్వారా వచ్చిన సరుకులు కొంటుండేవారు.

తమకున్న ఆగ్రహాన్ని ఎలా చూపించాలా అని అలోచిస్తున్న అమెరికన్లకు సన్స్ ఆఫ్ లిబర్టీ సంస్థ ఉద్యమకారులు బోస్టన్ రేవు వద్దనున్న ఈస్టు ఇండియాకు చెందిన టీపొడి రవాణా చేస్తున్న ఓడలోకి నేటివ్ అమెరికన్ల వలే మారు వేషం ధరించి ఆ ఓడలోని టీపొడి సరుకునంతా నీటిలో పడవేశారు. ఈ సంఘటన ద్వారా ఆగ్రహించిన బ్రిటీష్ ప్రభుత్వము, అమెరికాలోని మసాచ్యుసెట్స్ కాలనీ వాసులకు మరిన్ని నిర్భంధ చట్టాలను ప్రవేశపెట్టింది. ఈ చట్టాలలో బోస్టన్ రేవును మూసివేసి తమకు జరిగిన నష్టానికి పూర్తి పరహారం చెల్లించాలని కోరింది.

ఈ బోస్టన్ టీ పార్టీ సంఘటన అమెరికా దేశ స్వాతంత్ర్య ఉద్యమ సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది.

  1. Young, Shoemaker, 183–85.
  • Alexander, John K. Samuel Adams: America's Revolutionary Politician. Lanham, Maryland: Rowman & Littlefield, 2002. ISBN 0-7425-2115-X.
  • Ammerman, David (1974). In the Common Cause: American Response to the Coercive Acts of 1774. New York: Norton.
  • Carp, Benjamin L. Defiance of the Patriots: The Boston Tea Party and the Making of America (Yale U.P., 2010) ISBN 978-0-300-11705-9
  • Ketchum, Richard. Divided Loyalties: How the American Revolution came to New York. 2002. ISBN 0-8050-6120-7.
  • Knollenberg, Bernhard. Growth of the American Revolution, 1766–1775. New York: Free Press, 1975. ISBN 0-02-917110-5.
  • Labaree, Benjamin Woods. The Boston Tea Party. Originally published 1964. Boston: Northeastern University Press, 1979. ISBN 0-930350-05-7.
  • Maier, Pauline. The Old Revolutionaries: Political Lives in the Age of Samuel Adams. New York: Knopf, 1980. ISBN 0-394-51096-8.
  • Raphael, Ray. Founding Myths: Stories That Hide Our Patriotic Past. New York: The New Press, 2004. ISBN 1-56584-921-3.
  • Thomas, Peter D. G. The Townshend Duties Crisis: The Second Phase of the American Revolution, 1767–1773. Oxford: Oxford University Press, 1987. ISBN 0-19-822967-4.
  • Thomas, Peter D. G. Tea Party to Independence: The Third Phase of the American Revolution, 1773–1776. Oxford: Clarendon Press, 1991. ISBN 0-19-820142-7.
  • Young, Alfred F. The Shoemaker and the Tea Party: Memory and the American Revolution. Boston: Beacon Press, 1999. ISBN 0-8070-5405-4; ISBN 978-0-8070-5405-5.