బౌద్ద మతం విద్యావ్యవస్థ


మొదట కేవలం బౌద్ద సన్యాసులకు మాత్రమే పరిమితమైన విద్యావిధానం తరువాత అందరికీ అనుమతించాడినది. ఆరామాలు విద్యాకేంద్రాలుగా విలసిల్లినాయి. సంస్కృతము ప్రముఖమైన స్థానం పొందినప్పటికీ దేశభాషలాలోనే విద్యావిధానం వ్యాప్తిలో ఉండేది. మూస:భారత దేశ విద్యా వ్యవస్థ - చరిత్ర

విద్యార్థి జీవితం మార్చు

మొదట సహజ (ముందుకు వెళ్ళడం) అనే ఒక ఉత్సవం ద్వారా విద్యార్థిని ఆరు సంవత్సరాల ప్రాయంలో ఆరామంలోనిని అనుమతించేవారు. తరువాత పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఉపసంపద అనే మరో కార్యక్రమం ద్వారా అతనిని కొద్దిగా పెద్దవానిని చేసేవారు. ఇప్పటినుంది బిక్షం వేసుకోవడం, కాషాయం ధరించడం, చెట్ల క్రింద బ్రతకడం, ఆవు మూత్రం ఔషదంగా తీసుకోవడం, శృంగారానికి దూరంగా ఉండటం, దొంగతనాలు చేయకుండటం, చంపకుండా ఉండుటం వంటివి చేయాలి.

విద్యా విధానం మార్చు

ఎంతో మంది ఉపాద్యాయులు ఉండేవారు. ఇప్పటిలాగానే తరగతులు ఉండేవి.

పాఠ్యాంశాలు మార్చు

మతపరమైనవి సాహిత్యం పాళీ, సంస్కృతం బుద్ధుని బోధనలు కవిత్వం ఖగోళశాస్త్రం తత్వ శాస్త్రం హిందూ ధర్మాలు, మతం, మొదలగున్నవి

ఫీజులు మార్చు

ఉచితం, పూర్తి ఉచితంగా బోధన, నివాసం, వస్త్రాలు ఇచ్చేవారు. బిక్షాటన తప్పనిసరి, ముఖ్యముగా పన్నెండు సంవత్సరాల తరువాత. రాజులు, ధనికులు ఈ విద్యాలయాల పోషన చూసుకునేవారు.

విశ్వవిద్యాలయాల నిర్వహణ మార్చు

ఈ కాలంలో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు వచ్చినాయి. వీటి నిర్వహణ ఇప్పటివలే ఉండేది

ఒక బౌద్ద బిక్షువు పెద్దగా ఉండేవారు, ఇతనిని వయసు, అనుభవం, వ్యక్తిత్వం ఆధారంగా నిర్ణయించేవారు. (ఇప్పటి మన VC లాగా అన్నమాట) తరువాత అతనిక్రింద రెండు కౌన్సిల్లు ఉండేవి (లేదా మండలాలు ఉండేవి). ఒకటి విద్యా మండలి (మన teaching staff), వీరు బోధన, విద్యార్థులను చేర్చుకోవడం, పాఠ్యాంశాల నిర్ణయం, పరీక్షలు నిర్వహించడం చేసేవారు. తరువాతది నిర్వాహ మండలి (వీరు మన non teaching staff లాగా అన్నమాట). వీరు నిర్మాణాలు, ఆహారం, బట్టలు, వైద్యం, వసతి సౌకర్యాలు, ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారు.

హిందూ పద్దతి నుండి మార్పులు మార్చు

విశ్వవిద్యాలయాలు వచ్చినాయి గురుకులాలు పోయి పెద్ద పెద్ద ఆరామాలు వచ్చినాయి కానీ పాఠ్యాంశాలు మాత్రం అంతే పెద్దగా వచ్చినాయి, వేదాలు పోయి బౌద్ద మత గ్రంథాలు వచ్చినాయి, అంతే తేడా స్త్రీవిద్య బహు ప్రాచుర్యం పొందినది, ముఖ్యముగా నాలుగవ శతాబ్దం వరకూ.

ఈ కాలంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు మార్చు

ఈ కాలంలో అనేక ప్రముఖ విశ్వ విద్యాలయాలు వచ్చినాయి. వాటిలో చెప్పుకోవలసినవి నలందా, తక్షశిల, కంచి, మిథిల మొదల్గున్నవి