బౌరాపూర్ భ్రమరాంబ దేవాలయం
బౌరాపూర్ భ్రమరాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, బౌరాపూర్ గ్రామంలో ఉన్న భ్రమరాంబ దేవాలయం. భ్రమరాంబ దేవుత పేరుమీదుగా ఈ గ్రామానికి బౌరాపూర్ అనే పేరు వచ్చింది.[1] ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి.[2]
బౌరాపూర్ భ్రమరాంబ దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నాగర్‌కర్నూల్ జిల్లా |
ప్రదేశం: | బౌరాపూర్, అమ్రాబాద్ మండలం |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | భ్రమరాంబ |
చరిత్ర
మార్చుభ్రమరాంబ దేవాలయ వాస్తు శిల్ప శైలిని, ఈ విగ్రహాలని బట్టి మలి చాళక్యుల కాలం నుండి రేచర్ల పద్మనాయకుల కాలం వరకు దాదాపు వెయ్యేళ్ళపాటు మనుగడలో ఉన్నట్లు తొలుస్తోంది. 14వ శతాబ్దంలో భయంకరమైన వెంట్రుకలు విరబోసుకున్న, గదను ధరించిన, నల్లని శరీరం, వంకర చూపుగల దిగంబర క్షేత్ర పాలకుడు దక్షిణ ద్వారంలో ఉండేవాడు. అలువంటి భైరవుడి విగ్రహం బౌరాపూర్ భ్రమరాంబ ఆలయానికి దక్షిణాన చెరువు గట్టుపైన ఉంది. ఈ దేవాలయానికి తూర్పువైపున వినాయకుడి, మరోచోట హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి. పూర్వపురోజులలో నల్లమల అడవులగుండా శ్రీశైలంకు వెళ్ళేదారిలో నీటి వనరు ఉన్న ఏకైక క్షేత్రమది. అందుకే ఇక్కడ కాలాముఖ, కాపాలిక, పాశుపత, ఆరాధ్య, వీరశైవ, శాక్తేయ మత శాఖల మఠాధిపతులకు, అనుయాయులు సేదతీరేవారు.
ఉత్సవాలు
మార్చుచెంచులు భ్రమరాంబను తమ ఆడబిడ్డగా, మల్లన్నను అల్లుడిగా భావిస్తూ శివరాత్రికి బౌరాపూర్ లో ‘చెంచుల పండుగ’ పేరుతో పెద్ద జాతర నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఇక్కడి చెంచులు బౌరాపూర్ జాతరను నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం 2014 నుండి అధికారికంగా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో సమీపంలోని చెంచులంతా బౌరాపూర్‌కు వెళ్ళి, తమ ఆచార వ్యవహారాలనుతో మల్లయ్య, బౌరమ్మలను కొలుచుకుంటారు.[3]
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు, అభివద్ధి కార్యక్రమాలపై అవగాహన మొదలైనవి ఉంటాయి. ఉత్సవాలలో మొదటిరోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు స్వాగతోపన్యాసం కార్యక్రమాలు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 12గంటల వరకు చెంచుల సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు, చెంచుల ఆట–పాట సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి. రెండవరోజు 11గంటలకు భ్రమరాంబ, మల్లిఖార్జునస్వామి కళ్యాణం, మూడవరోజు ప్రత్యేక పూజలు ఉంటాయి. నల్లమల చెంచులతోపాటు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా చెంచులు అధిక సంఖ్యలో వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.[4]
మూలాలు
మార్చు- ↑ Velugu, V6 (2019-03-04). "బౌరాపూర్ .. తెలంగాణ శ్రీశైలం". V6 Velugu (in ఇంగ్లీష్). ద్యావనపల్లి సత్యనారాయణ. Archived from the original on 2019-06-11. Retrieved 2021-10-29.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "అధికారికంగా బౌరాపూర్ భ్రమరాంబ జాతర". Sakshi. 2019-02-28. Archived from the original on 2019-02-28. Retrieved 2021-10-29.
- ↑ "అతి ప్రాచీన చెంచు క్షేత్రం బౌరాపురం | జాతర | www.NavaTelangana.com". NavaTelangana. 2019-03-05. Archived from the original on 2019-04-14. Retrieved 2021-10-29.
- ↑ "నల్లమల ముస్తాబు". Sakshi. 2020-02-20. Archived from the original on 2020-10-21. Retrieved 2021-10-29.