బ్లడ్ వుడ్ చెట్టు
హేమాటాక్సైలమ్ కాంపెచియానం ( బ్లాక్ ఉండ్, బ్లడ్ ఉడ్ చెట్టు, బ్లూ వుడ్, కాంపెచీ చెట్టు, కాంపెచీ వుడ్, కాంపెచీ లాగ్ వుడ్, కాంపెచీ వుడ్, జమైకా వుడ్, లాగ్ ఉడ్ లేదా లాగ్ వుడ్ చెట్టు)[1] పుష్పించే వృక్షాల జాతికి చెందినది. ఇది లెగ్యూం కుటుంబానికి చెందినది. ఇది దక్షిణ మెక్సికో ప్రాంతానికి చెందినది. ఈ చెట్టు కరేబియన్, ఉత్తర మధ్య అమెరికా లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయబడింది. [2] ఈ చెట్టు 17వశతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు ఆర్థికంగా ఉపయుక్తమైన వృక్షంగా గుర్తించబడింది. ఇది అద్దకం రంగుల కోసం ఉపయోగపడుతున్నందున దీనిని ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.[3] నవీన బెజ్లీ దేశం 17వ శతాబ్దం, 18వ శతాబ్దంలలో లాగింగ్ కాంప్స్ నెలకొల్పి వీటిని అభివృద్ధి చేసింది. ఈ చెట్టు శాస్త్రీయ నామం "బ్లడ్ వుడ్" ఈ చెట్టు నుండి ముదురు ఎరుపు రంగు ద్రవ కారుతుంది.ఈ కారణంగా ఈ చెట్టును బ్లడ్ వుడ్ చెట్టు అని పిలుస్తారు.ఈ చెట్టు 12 నుంచి 18 మీటర్ల పొడవు పెరుగుతుంది. పువ్వులు శీతాకాలంలో నెలల్లో కనిపిస్తాయి.[4]
ప్రాంతం
మార్చుదక్షిణ ఆస్ట్రేలియా ఎడారి వాతావరణంలో ఈ చెట్టు పెరుగుతుంది. చెట్టు నుండి వచ్చే ద్రవం ఎర్రటి రంగులో కలిగి ఉంటుంది.
ఉపయోగాలు
మార్చుకడుపు నొప్పి, మలేరియా, జ్వరము, రొమ్ములో పాలు లేకపోవటం చికిత్సకు ఈ చెట్టు ఉపయోగపడుతుంది.అలాగే దాని చెక్కతో ఫర్నిచర్ తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది.అద్భుతమైన నాణ్యత కారణంగా అధిక స్థాయిలో అమ్మబడుతుంది.
మూలాలు
మార్చు- ↑ Umberto Quattrocchi (2012). CRC World Dictionary of Medicinal and Poisonous Plants. Common Names, Scientific Names, Eponyms, Synonyms and Etymology (5 Volume Set). Boca Raton: CRC Press, Taylor & Francis Group. p. 1919. ISBN 9781420080445.
- ↑ "Haematoxylum campechianum". Germplasm Resources Information Network (GRIN). Agricultural Research Service (ARS), United States Department of Agriculture (USDA). Retrieved 2009-01-27.
- ↑ Hofenk de Graff, Judith H. (2004). The Colourful Past: Origins, Chemistry and Identification of Natural Dyestuffs. London: Archetype Books. p. 235. ISBN 1873132131.
- ↑ Umberto Quattrocchi (2012). CRC World Dictionary of Medicinal and Poisonous Plants. Common Names, Scientific Names, Eponyms, Synonyms and Etymology (5 Volume Set). Boca Raton: CRC Press, Taylor & Francis Group. p. 1919. ISBN 9781420080445.