బ్లాక్‌చైన్ ఒక సైబర్ భద్రతా వ్యవస్థ. ఇందులో డేటా తస్కరించుటకు హ్యాకర్లకు అవకాశం ఉండదు.

బ్లాక్‌చైన్ నిర్మాణము. ప్రధాన చైన్ (నలుపు రంగు) నందు జెనసిస్ బ్లాక్ (ఆకుపచ్చ) నుండి ప్రారంభమై ఉండుట గమనించవచ్చు. అనాధ బ్లాక్స్ (పర్పుల్) ప్రధాన చైన్ బయట ఉన్న విషయాన్ని గమనించవచ్చు.

నేపధ్యము

మార్చు

ఒక విలువైన, రహస్యమైన సమాచారాన్ని వివిధ ప్రాంతాలలో భద్రపరిచి దాన్ని ఇతరులు తస్కరించకుండా ఒకదానితో మరొకటి అనుసంధానించి దానికి సాంకేతిక భద్రత కల్పించమే ఈ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ. ఈ విధానంలో డేటాను నింపేవారికి ఒక రహస్య పాస్‌వర్డ్‌ అందిస్తారు. వారు కూడా క్షణాల్లో దీనిలోకి ప్రవేశించి సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.

నెట్‌వర్క్‌లోకి పాస్‌వర్డ్‌ కలిగిన వారు మాత్రమే ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. వీరు తప్ప మరొకరు ప్రవేశించడానికి ప్రయత్నిస్తే మిగిలిన వారికి ఈ సమాచారం క్షణాల్లో తెలిసిపోవడంతో అప్రమత్తమవుతారు. ఈ విధంగా ఇది అత్యంత భద్రమైంది. ఇందులో డేటాను భద్రపరిచే ప్రాంతాలను నోడ్స్‌ అని.. పాస్‌వర్డ్‌ను హాష్‌కీ పిలుస్తారు. డేటాను క్రిప్టాలజీ విధానం ద్వారా కోడ్స్‌లోకి మార్చి భద్రపరుస్తారు. డేటాను చోరీ చేయాలనుకునే వారు ఒకేసారి భద్రపరిచిన నోడ్స్‌ అన్నింటిపైన ఏకకాలంలో ఒకేసారి దాడిచేసి డేటాను తీసుకోవాల్సి ఉంటుంది.[1][2]

బ్లాక్‌చైన్ ఉపయోగాలు

మార్చు
  • భూరికార్డులను ట్యాంపరింగ్ జరగకుండా భద్రపరచవచ్చు.
  • బ్యాంకు లావాదేవీలపై హ్యాకర్ల దాడిని పూర్తిగా నిరోధించవచ్చు.
  • ఓటర్ల జాబితాలను ఈ విధానంలో అనుసంధానం చేయడం వల్ల దేశంలో ఎక్కడ నుంచైనా ఓటుహక్కు వినియోగించుకోవడంతోపాటు ఒకేవ్యక్తి రెండు ఓట్లు వేయడం, నకిలీ ఓట్లు వేయడాన్ని నిరోధించవచ్చు. ఎన్నికలు కూడా దీని ద్వారా నిర్వహించవచ్చు.
  • టోల్‌గేట్‌, ఆర్టీసీ, రైల్వే వంటి సేవలను పొందడానికి ఒకప్రాంతంలో కార్డు తీసుకుంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా సులభంగా ప్రయాణం, సౌకర్యాలు పొందే అవకాశం ఏర్పడుతుంది.
  • బ్యాంకుల్లో సులభంగా రైతులు రుణాలు తీసుకునే అవకాశం.
  • రోగులకు చేసే పరీక్షల వివరాలు ఈ విధానంలో నమోదు చేస్తే మళ్లీమళ్లీ పరీక్షలు చేసే అవకాశం ఉండదు.

మూలాలు

మార్చు
  1. Narayanan, Arvind; Bonneau, Joseph; Felten, Edward; Miller, Andrew; Goldfeder, Steven (2016). Bitcoin and cryptocurrency technologies: a comprehensive introduction. Princeton: Princeton University Press. ISBN 978-0-691-17169-2.
  2. Iansiti, Marco; Lakhani, Karim R. (జనవరి 2017). "The Truth About Blockchain". Harvard Business Review. Harvard University. Archived from the original on 18 జనవరి 2017. Retrieved 17 జనవరి 2017. The technology at the heart of bitcoin and other virtual currencies, blockchain is an open, distributed ledger that can record transactions between two parties efficiently and in a verifiable and permanent way.

బయటి లంకెలు

మార్చు

  Media related to బ్లాక్‌చైన్ at Wikimedia Commons