భగదత్తుడు

ప్రాగ్జ్యోతిష రాజ్య పాలకుడు నరకాసురుడి కుమారుడు, నరక రాజవంశం రాజులలో రెండవవాడు.

భగదత్తుడు ప్రాగ్జ్యోతిష రాజ్య పాలకుడు నరకాసురుడి కుమారుడు,[1] నరక రాజవంశం రాజులలో రెండవవాడు. అతని తరువాత అతని కుమారుడు వజ్రదత్తుడు రాజయ్యాడు. శ్రీకృష్ణుడు తన తండ్రిని చంపాడని కృష్ణుడి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన ఉన్నాడు. కిరాత్ సైన్యానికి నాయకుడు.[2]

భగదత్తుడు అతని అమ్మమ్మ కృష్ణుడికి ప్రార్థనలు చేయడం
దస్త్రం:Arjuna kills Bhagaddatta.jpg
భగదత్తుడిపై బాణం వేస్తున్న అర్జునుడు

జీవిత విషయాలు

మార్చు

భూదేవి ప్రసాదించిన వైష్ణవాస్త్రాన్ని నరకాసురుడు తన కుమారుడైన భగదత్తుడుకి ఇస్తాడు. అస్రాల్లో కంటే ఎంతో వేగవంతమైన ఈ వైష్ణవాస్త్రానికి తిరుగు ఉండదు. అంతేకాకుండా నరకాసురిడి దగ్గర సుప్రతిక అనే శక్తివంతమైన ఏనుగు కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో భగదత్తుడు కౌరవుల పక్షాన పోరాడాడు. అతను తన ఏనుగుపై యుద్ధం చేసే నైపుణ్యం కలవాడు. యుద్ధం జరిగిన 12వ రోజు అర్జునుడితో భీకర యుద్ధంలో పాల్గొన్నాడు. భగదత్తుడి పద్నాలుగు ఇనప గదల్ని అర్జునుడు ముక్కలు చేశాడు. భగదత్తుడి రాజఛత్రాన్నీ ధ్వజాన్నీ ముక్కలు చేయగా, కోపంతో భగదత్తుడు తన చేతిలో ఉన్న అంకుశాన్ని వైష్ణవాస్త్ర మంత్రంతో అర్జునుడిపై వదిలాడు.[3] అది చూసి కృష్ణుడు రథసారధి స్థానం వద్ద నిలబడి వైష్ణవస్త్రానికి ఎదురునిలవగా ఆ అస్త్రం దండగా కృష్ణుడి మెడలో పడి వైజయంతీమాలగా మారిపోయింది. (విష్ణువు భగదత్తుడికికు ఇచ్చిన ఆయుధం చివరికి తన అవతారం దగ్గరికే తిరిగి వచ్చింది).

భగదత్తుడి కన్నులపైన రెప్పలు వాలిపోయి ఉండడంతో కళ్ళను తెరిచి ఉంచడంకోసం ఒక పట్టీతో నొసటి మీద కట్టుకొని రెప్పల్ని పైకి పట్టి ఉంచుతాడు. ఈ రహస్యం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి ముందుగా ఆ పట్టిని కొట్టమని చెప్పాడు. బాణంతో భగదత్తుడి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడంతో అది కింద పడిపోయింది. వెంటనే బాణంతో రెప్పల్ని కట్టిన పట్టీని కొట్టగా భగదత్తుడి కళ్ళు మూసుకుపోయి చీకటిమయమయింది. అప్పుడు అర్జునుడు అర్ధచంద్ర బాణం వేయగా అది భగదత్తుడి ఛాతీకి తాకి భగదత్తుడు చనిపోయాడు.[4][5][6]

కలిక పురాణం, హర్షచరిత పురాణాలు, ఇతర పురాణాలలో ప్రస్తావించిన దాన్నిబట్టి నరకాసురుడికి భగదత్తుడు, మహాసిర్స, మాధవన్, సుమాలి అను కుమారులు ఉన్నారు. భగదత్తుడికి వజ్రదత్తుడు, పుష్పదత్తుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. భగదత్తుడు, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 131.
  2. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (7 February 2016). "భగదత్తుడు". Sakshi. Archived from the original on 2 July 2020. Retrieved 2 July 2020.
  3. Menon, Ramesh (2006) The Mahabharata: A Modern Rendering iUniverse, Inc., New York, page 231-232, ISBN 978-0-595-40187-1
  4. "Bhagadatta - King of Pragjyotisha - Indian Mythology". Archived from the original on 2005-08-28. Retrieved 2020-07-02.
  5. "The Mahābhārata, Book 6: Bhishma Parva: Bhagavat-Gita Parva: Section LXIV".
  6. Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 75.